– మచిలీపట్నం చరిత్రలో మసులా బీచ్ ఫెస్ట్ మరచిపోలేనిది
– రిసార్ట్స్, వాటర్ స్ప్రోట్స్, సినీ షూటింగులకు సన్నాహాలు చేస్తున్నాం
– పర్యాటకులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించేలా ఏర్పాట్లు
– సీఎస్ఆర్ ఫండ్స్‌తో బీచ్‌లో మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలో మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నం నియోజకవర్గంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు మంగినపూడి బీచ్‌లో రూ.96 లక్షల ఏపీఎండీసీ సీఎస్ఆర్ నిధులతో నిర్మిస్తున్న మరుగుదొడ్లు, కాఫీ షాప్ భవనాలకు శంకుస్థాపన చేశారు. బీచ్ పరిసరాల్లో ఏర్పాట్లపై నాయకులు, ప్రజలతో మాట్లాడి తెలుసుకున్నారు. బీచ్ కు వచ్చే పర్యాటకులతో మాట్లాడి సమస్యలు తెలుసుకన్నారు. జరుగుతున్న అభివృద్ధి పనులని పరిశీలించారు. రోడ్లు, కాలువలను పరిశీలించి మరింత అభివృద్ధికి అవసరమైన సూచనలు చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మచిలీపట్నం మంగినపూడి బీచ్‌కు అత్యంత ఘన చరిత్ర ఉంది. అనేక మత విశ్వాసాలకు అనుబంధం ఉంది. పర్యాటకంగా మంగినపూడి బీచ్ అభివృద్ధిలో భాగంగా గత సంవత్సరం బీచ్ ఫెస్టివల్ నిర్వహించాం. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. 2014-19 మధ్య కాలంలో ఆ ప్రాంతం మొత్తాన్ని మెరక చేశాం. ఇంటర్నల్ రోడ్లు నిర్మించాం. వాకింగ్ ట్రాక్స్ నిర్మించాం.
2019-24 మధ్య కాలంలో మంగినపూడి బీచ్‌ను నాశనం చేశారు. పర్యాటకులు రావాలంటే కనీసం రోడ్డు సదుపాయం కూడా లేకుండా తయారైంది. కూటమి అధికారంలోకి రాగానే ఈ ప్రాంతంలో అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. పర్యాటకులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నూతనంగా మరుగుదొడ్లు, టీ స్టాల్ ఏర్పాటు చేసేలా సన్నాహాలు చేస్తున్నాం. ఏపీఎండీసీ సీఎస్‌ఆర్ ఫండ్ ద్వారా రూ.96 లక్ష వ్యయంతో అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. పంచాయతీరాజ్ నుండి వచ్చిన నిధులలో రూ.90 లక్షలతో ఈ ప్రాంతంలో రోడ్లు నిర్మించాం.
మచిలీపట్నం బీచ్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాం. రిసార్ట్స్, సినీ షూటింగ్స్ కోసం స్టూడియో, గోల్ఫ్ కోర్టు కూడా ఏర్పాటు చేసేలా భూ కేటాయింపులు చేస్తున్నాం. పోస్ట్ కార్డ్ అనే సంస్థ ఈ ప్రాంతంలో రిసార్ట్స్ నిర్మించేందుకు ముందుకొచ్చింది. మైరా సంస్థ సినీ స్టూడియో నిర్మాణానికి చర్చలు జరుగుతున్నాయి.
మసులా బే పార్క్ పేరుతో ప్రత్యేకంగా స్వచ్ఛంద సంస్థ ఏర్పాటైంది. మెరీనా అనే సంస్థ బోట్స్ నిర్మాణం, పార్కింగ్ కోసం సంప్రదించింది. ఈ ప్రాంతంలో హెరిటేజ్ విలేజ్ అభివృద్ధికి కొంత మంది సినీ ప్రముఖులు ప్రయత్నిస్తున్నారు. డచ్, పోర్చుగీస్, బ్రిటన్‌కు చెందిన కొంత మంది వారి పూర్వీకుల సమాధుల పరిరక్షణ కోసం ప్రయత్నిస్తున్నారు. మచిలీపట్నం బీచ్ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా అందాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తాం. అనుమతుల విషయంలోనూ అధికారులు సహకరిస్తున్నారు. గతంలో నిర్వహించిన మసులా బీచ్ ఫెస్టివల్ గ్రాండ్ సక్సెస్ చేశాం. లక్షలాది మంది వచ్చి మరింత మందికి వివరించారు. క్రీడా వినోదాల కేంద్రంగా మసులా బీచ్ ఫెస్టివల్ జరిగింది. అదే స్పూర్తితో మచిలీపట్నాన్ని పర్యాటక రంగానికి కేరాఫ్ అడ్రస్ గా మారుస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News