Breaking News

Tag Archives: machilipatnam

జిల్లాలో ఎం ఎస్ ఎం ఈ సర్వే ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎం ఎస్ ఎం ఈ సర్వే ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్లో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సంబంధిత అధికారులతో సమావేశమై, జిల్లాలో ఎంపీడీవోలు, డి ఆర్ డి ఏ మెప్మా జిల్లా పరిషత్ అధికారులతో శుక్రవారం కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(micro, small & medium enterprises) ( ఎం ఎస్ ఎం ఈ) సర్వే …

Read More »

సూర్య ఘర్ పధకం లక్ష్యం ప్రయోజనాలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పీఎం సూర్య ఘర్ పథకం ప్రజలు విరివిగా సద్వినియోగం చేసుకునేలా వారికి బ్యాంకు రుణాలు సకాలంలో అందించి సహకరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బ్యాంకు అధికారులకు సూచించారు. కలెక్టర్ గురువారం కలెక్టరేట్లో ఏపీ సిపిడిసిఎల్, ఎల్ డి ఎం, సంబంధిత అధికారులతో సమావేశమై, జిల్లాలో విద్యుత్ డి ఇ, ఏఈలు, ఎనర్జీ అసిస్టెంట్లు, వివిధ బ్యాంకుల కంట్రోలింగ్ అధికారులు, బ్యాంకు మేనేజర్లు, వెండర్ లతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి సూర్య ఘర్ పధకం లక్ష్యం ప్రయోజనాలు …

Read More »

పీహెచ్సీల నిర్వహణ బాగుంది

-పీహెచ్సీలలో డెలివరీలు పెంచాలి -ఎన్టీఆర్ వైద్య సేవ సద్వినియోగం చేసుకోవాలి -వైద్య సిబ్బందికి శిక్షణలు ఇవ్వాలి -ఆయుష్మాన్ భారత్ వైద్య సేవల పట్ల అవగాహన కల్పించాలి -రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పీహెచ్ శీల నిర్వహణ పట్ల శ్రద్ధ వహించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్. వాకాటి కరుణ వైద్యాధికారులను ఆదేశించారు. కమిషనర్ బుధవారం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జిల్లా కలెక్టర్, డి …

Read More »

పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 23, 24 తేదీలలో ఓటర్ల జాబితా సవరణ కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫోటో ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం -2025లో భాగంగా …

Read More »

చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ లో పిల్లలకు కనీస సదుపాయాలు కల్పించేలా పర్యవేక్షించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ నిబంధనల ప్రకారం నమోదు చేసుకుని, వాటిల్లో పిల్లలకు కనీస సదుపాయాలు కల్పించేలా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్లో జిల్లాలో చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ లో సదుపాయాలు, జేజే యాక్ట్ నిబంధనల అమలు తదితర అంశాలపై జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు కలెక్టర్ సమీక్షిస్తూ జిల్లాలో అన్ని చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లను పరిశీలించి, నియమ …

Read More »

రహదారి ప్రమాదాలు నివారించుటకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రహదారి ప్రమాదాలు నివారించుటకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల తో పాటు ఈ సంవత్సరం గత నెలల్లో జరిగిన ప్రమాదాలతో పోలిస్తే ఈసారి సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో రహదారి ప్రమాదాలు తగ్గాయన్నారు. గత సెప్టెంబర్ మాసంలో 53 …

Read More »

ఇంజనీరింగ్ పనులు విధిగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సత్వరమే పూర్తి చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో చేపట్టిన వివిధ ఇంజనీరింగ్ పనులు విధిగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని వారి చాంబర్లో రహదారులు భవనాలు గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి పలు రహదారులు, ప్రహరీలు, మురికి కాలువలు తదితర నిర్మాణాల పురోగతిపై సమీక్షించారు. పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగం పరిధిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ …

Read More »

డిసెంబర్ నెలలో 27, 28, 29 తేదీలలో కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ సాంస్కృతిక పరిశోధన శిక్షణ కేంద్రం (ఎన్సిఆర్టిసి) సీఈవో డా.తాడేపల్లి శర్మ, కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్స్ సొసైటీ చైర్మన్ డాక్టర్ వేదాంతం వెంకట నాగచలపతిరావు మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీని కలెక్టరేట్లోని వారి చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ స్వర్ణోత్సవాలలో పాల్గొనాలని వారు జిల్లా కలెక్టర్ ని కోరుతూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో వచ్చే డిసెంబర్ నెలలో 27,28, 29 తేదీలలో కూచిపూడి …

Read More »

పారిశుధ్యం పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి…

మచిలీపట్నం (చిన్నాపురం), నేటి పత్రిక ప్రజావార్త : పారిశుధ్యం ద్వారా గౌరవం మరియు ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం కలుగుతుందని, పారిశుధ్యం పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం బందరు మండలం చిన్నాపురంలో ఎంపీపీ పాఠశాలలో జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి మరుగుదొడ్లకు రంగులు వేయడం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీ కలెక్టర్ ప్రారంభించారు. “మరుగు దోడ్లు వాడదాం-పరిసరాలు పరిరక్షిద్దాం”, మరుగుదొడ్లు వాడదాం- ఆరోగ్యాన్ని రక్షించుకుందాం” అంటూ …

Read More »

గన్నవరంలో “జాబ్ మేళా”

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్ మరియు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, గన్నవరం సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.18.11.2024 సోమవారం నాడు గన్నవరం లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా ఒకేషనల్ ఉపాధి కల్పన అధికారి సత్య బ్రహ్మం , జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి dr పి. నరేష్ …

Read More »