మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : రోడ్డు ప్రమాదాలు తగ్గించే దిశగా ప్రతి డ్రైవర్ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని, అప్పుడే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు ఎం రాజుబాబు అన్నారు. స్థానిక మైలవరం బైపాస్ రోడ్డు లో గల బెస్ట్ హెవీ మోటార్ డ్రైవింగ్ స్కూల్ లో తొమ్మిది వందల మందికి శిక్షణ పూర్తిచేసిన చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం రాజుబాబు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
Read More »Tag Archives: mylavaram
మైలవరం నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో ఇళ్లపట్టాలు, ఇంటి నిర్మాణాలు…
-శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ కృషితో పేదలకు న్యాయం -దశాబ్దాల నాటి పేదల సొంతింటి కల నెరవేరుతున్న వైనం -శరవేగంగా అమలవుతున్న నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ళు పథకం మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద మైలవరం నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో ఇళ్ల పట్టాలు మంజూరు కాగా, పక్కాగృహాల నిర్మాణాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ కృషితో దశాబ్దాల నాటి పేదల సొంతింటి కల నెరవేరుతుంది. దీంతో లబ్ధిదారులైన పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శాసనసభ్యులు …
Read More »భారతదేశ రక్షణ రంగాన్ని అగ్రపథంలో నిలిపిన క్షిపణి పితామహుడు డా. ఏపీజే అబ్దుల్ కలాం…
-మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : మైలవరం పార్టీ కార్యాలయం లో డా. ఏపీజే అబ్దుల్ కలాం వర్దంతి సందర్భంగా పార్టీ నాయకులు అధికారులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశ రక్షణ రంగాన్ని అగ్రపథంలో నిలిపి, దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం గా ఇనుమడింప చేసిన గొప్ప శాస్త్రజ్ఞుడు, మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపిజే అబ్దుల్ కలాం గారు అని కోనియాడారు. ఈ కార్యక్రమం లో …
Read More »ఇళ్ల స్థలాల లేఅవుట్ పరిశీలన…
మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : మైలవరం మండలం చండ్రగూడెం గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన ఇళ్ల స్థలాల లేఅవుట్ ను శుక్రవారం మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా.కె. మాధవిలత సందర్శించారు. శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ జగనన్న ఇళ్ల స్థలాల పేరుతో పేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించనున్న స్థలం అనువైనదిగా లేకపోవడంతో లబ్దిదారుల సమస్యను పరిష్కరించేందుకు ఈనెల 3వ తేదిన లేఅవుట్ ను పరిశీలించడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జాయింట్ కలెక్టర్ దృష్టికి …
Read More »రైతు భరోసా చైతన్య యాత్రలు సద్వినియోగం చేసుకోండి : జెసి డా. మాధవిలత
మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఈ నెల 23వ తేదీ వరకు రైతు భరోసా చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా.కె. మాధవిలత చెప్పారు. శుక్రవారం మైలవరం రైతు భరోసా కేంద్రంలో నిర్వహించిన రైతు భరోసా చైతన్య యాత్ర కార్యక్రమంలో జెసి మాధవిలత పాల్గొన్నారు. తొలిత రైతు భరోసా కేంద్రాన్ని జెసి మాధవిలత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో సాగు సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కర మార్గాలు తెలియజేసేందు ప్రభుత్వం ఈనెల 9 నుంచి 23 …
Read More »