ఇంటింటి సర్వేపై భూత్‌ స్థాయి అధికారుల శిక్షణా కార్యక్రమం

మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తప్పులు లేని ఖచ్చితమైన ఓటర్ల జాబితా రూపొందించడంలో ఇంటింటి సర్వే కీలకమని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు భూత్‌ స్థాయి అధికారులతో అన్నారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ -2024లో భాగంగా మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ ఇంటింటి సర్వేపై భూత్‌ స్థాయి అధికారుల శిక్షణా కార్యక్రమాన్ని గురువారం మైలవరం సాయిబాబా కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ ఈనెల 21వ తేది నుండి ఆగస్టు 21వ తేది వరకు నెల రోజుల పాటు ప్రత్యేక సంక్షిప్త సవరణలో భాగంగా బిఎల్‌వోలు డోర్‌టు డోర్‌ వెరిఫికేషన్‌ నిర్వహించవలసి ఉంటుందన్నారు. భూత్‌ స్థాయి అధికారులు ఎన్నికల కమీషన్‌ నిబంధనలపై అవగాహన కల్పించుకుని క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబిత తనిఖీలో పలు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందన్నారు. పారదర్శకమైన ఓటర్ల జాబితా నిర్థారణతో పోలింగ్‌ శాతం ఆధారపడుతుందన్నారు. భూత్‌ లెవల్‌ అధికారులు ఇంటింటి సర్వే ప్రక్రియను ఆగస్టు 24వ తేది నాటికి పూర్తి చేసి తుది ఓటర్ల జాబితా సిద్దం చేయాలన్నారు. ఇంటింటి సర్వేలో కొత్త ఓటర్ల నమోదు, మరణించిన, ఒక నియోజకవర్గం నుండి మరోక నియోజకవర్గానికి వలస, ఒకే డోర్‌ నెంబర్‌పై పలు ఓట్లతో తప్పుగా నమోదు, తప్పుడు డోర్‌ నెంబర్లతో నమోదైన ఓటర్ల వివరాలపై భూత్‌ స్థాయి అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందన్నారు. ఫామ్‌ 6 ద్వారా కొత్త ఓటర్ల నమోదు, ఫామ్‌ 8 ఏ ద్వారా నియోజకవర్గాల మార్పులు, మరణించిన ఓటర్లను ఫామ్‌ 7 ద్వారా తొలగించడం, వంటి ధరఖాస్తులపై అవగాహన ఉండాలన్నారు. ఓటర్ల నమోదుపై వస్తున్న ధరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి వివరాలను పోర్టల్‌ లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ యువ ఓటర్‌ను గుర్తించి నమోదు చేయాలని కలెక్టర్‌ డిల్లీరావు బిఎల్‌వోలను ఆదేశించారు.
శిక్షణా కార్యక్రమంలో డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌, తహాశీల్థార్‌ శ్రీనివాస్‌రావు, సివిల్‌సప్లయి డియం వెంకటేశ్వర్లు, కోఆర్డినేషన్‌ సెక్షన్‌ సూపరిండెంటెంట్‌ సిహెచ్‌ దుర్గాప్రసాద్‌, మైలవరం నియోజకవర్గ బిఎల్‌వోలు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *