Breaking News

మైలవరం నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో ఇళ్లపట్టాలు, ఇంటి నిర్మాణాలు…


-శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ కృషితో పేదలకు న్యాయం
-దశాబ్దాల నాటి పేదల సొంతింటి కల నెరవేరుతున్న వైనం
-శరవేగంగా అమలవుతున్న నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ళు పథకం

మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద మైలవరం నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో ఇళ్ల పట్టాలు మంజూరు కాగా, పక్కాగృహాల నిర్మాణాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ కృషితో దశాబ్దాల నాటి పేదల సొంతింటి కల నెరవేరుతుంది. దీంతో లబ్ధిదారులైన పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కుల, మత, రాజకీయాలు, పార్టీలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక కూడా పారదర్శకంగా జరుగుతోందని ప్రజలు పేర్కొంటున్నారు. మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 20 వేల మందికి ఇళ్లపట్టాలు మంజూరు చేశారు. నియోజకవర్గంలో 15,492 పక్కా గృహాలు మంజూరయ్యాయి. దీనికి సంబంధించి ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకానికి సంబంధించి బిలో బేస్మెంట్ లెవెల్ లో 8,475 గృహాలు ఉన్నాయి. 2,068 పక్క గ్రహాలు బేస్మెంట్ లెవల్ పూర్తయ్యాయి. రూఫ్ లెవల్ లో అనగా స్లాబ్ లెవల్లో 359, రూఫ్ కాస్టింగ్ అనగా స్లాబ్ పూర్తయిన లెవల్లో 764 ఇళ్ళు ఉన్నాయి. ఈ విషయాన్ని హౌసింగ్ శాఖ అధికారులు వెల్లడించారు. వీటి మొత్తానికి సంబంధించి ఇప్పటివరకు నియోజకవర్గ వ్యాప్తంగా రూ.26,11,46,360లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అన్ని అర్హతలు కలిగిన వారందరికీ పక్కా గృహాలు మంజూరు చేస్తున్నట్లు మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *