ముఖ్యమంత్రి జగనన్న నిర్ణయమే శిరోధార్యం

-స్పష్టం చేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్

జి.కొండూరు,  నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయమే తనకు శిరోధార్యమని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. జి.కొండూరు మండలం చెరువు మాధవరం గ్రామంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి పనుల నిమిత్తం సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని నిన్న గురువారం కలిసినట్లు వెల్లడించారు. 2019లో సీఎం జగనన్న ఆదేశాల మేరకు మైలవరం నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచానన్నారు. మైలవరం నియోజకవర్గ ప్రజల సంక్షేమం, సమగ్రాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేసినట్లు పేర్కొన్నారు. సీఎం జగనన్న ఆదేశాలను తప్పనిసరిగా ఆచరిస్తానన్నారు. ఇందులో ఎలాంటి సందేహాలకు తావు లేదన్నారు. మీడియాలో రకరకాల కథనాలు, సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయన్నారు. జి.కొండూరు నుంచి దుగ్గిరాలపాడు వరకు రహదారి అభివృద్ధికి నిధుల విడుదలకు, కందులపాడు నుంచి విజయవాడ- విస్సన్నపేట ప్రధాన రహదారి అభివృద్ధి పనుల ప్రారంభం గురించి ముఖ్యమంత్రి గారిని కలిసినట్లు స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *