విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఓట్ల రాజకీయాలు పక్కన పెట్టీ ప్రజాసమస్యల పరిష్కారానికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని 6వ డివిజన్ లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ వియ్యపు అమర్నాధ్ ఆధ్వర్యంలో చలసాని వారి స్ట్రీట్,గంగానమ్మ గుడి స్ట్రీట్ కొండ పైన ప్రాంతాలలో అవినాష్ ఇంటింటికీ వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలు వారికి వివరించి,డివిజన్ అబివృది కరపత్రాలను అందచేసి,మన ప్రభుత్వం రావడం వలన మీకు ఇన్నిన్ని ప్రయోజనాలు చేకూరడం జరుగుతుంది అని, అలానే నియోజకవర్గాన్ని కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని,అవినీతి రహిత పాలన అందించడమే కాకుండా మీకు అందరికీ తోడు నీడగా నిలుస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి మీరంతా బాసటగా నిలవాలి అని అన్నారు. ఆయనకు మీ అందరి దీవెనలు,ఆశీర్వాదాలు అందచేయాలని, మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ని చేయాలని కోరారు. అవినాష్ రాకతో డివిజన్ ప్రజలు ఘన స్వాగతం పలికి ఆయనకు బ్రహ్మరధం పట్టారు. కొండ చివరి అంచున ఉన్న ఏ గడపకు వెళ్ళినా ఆప్యాయంగా ఆహ్వానం పలుకుతూ స్వయానా ఇంటికి విచ్చేయడం,తమ కష్టసుఖాలు అడిగి తెలుసుకుని ప్రభుత్వ తరుపున మరింతగా అండగా నిలుస్తాము అని భరోసా ఇవ్వడం చాలా గొప్ప విషయం అని తాము ఇంత వరకు ఏ ప్రభుత్వంలో కూడా చూడని గొప్ప పరిపాలనను చూస్తున్నాం అని ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. స్థానిక ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కొండ ప్రాంతం అధికంగా ఉన్న ఈ డివిజన్ అంతటికీ మంచినీటి సమస్య పరిష్కారం అయ్యేలా పైప్ లైన్ ఏర్పాటు చేయడంతో పాటు పెండింగులో ఉన్న నూతన మెట్ల మార్గాలు,రోడ్డు నిర్మాణాలు శంకుస్థాపన చేసి కొన్ని ప్రారంభించడం కూడా జరిగింది అన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చిన,అర్హత ఉండి ఏ సంక్షేమ పధకం అందకపోయిన తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.ప్రజలు వద్దకు వెళ్తుంటే జగన్ పాలన గురించి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వం లో స్థానిక ఎమ్మెల్యే నిధులు ఇవ్వకుండా అభివృద్ధి ని నిర్లక్ష్యం చేసారని విమర్శించారు. మరలా ఇప్పుడు వైస్సార్సీపీ ప్రభుత్వం లో కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేపించి నూతన మెట్లు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణాలు, మంచినీటి సమస్య పరిష్కారానికి వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. సంక్షేమ పథకాలను ఇళ్ల వద్దకే చేరుస్తున్న ఘనత జగన్ దే అని అన్నారు. ఈ కార్యక్రమంలో 6వ డివిజన్ కార్పొరేటర్ వియ్యపు అమర్నాధ్, రాష్ట్ర తూర్పు కార్పొరేషన్ వెల్ఫేర్ డైరక్టర్ శ్రీ ఇజ్జాడ తేజేష్, డివిజన్ అధ్యక్షులు లంకా అబ్బినాయుడు, వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు,అప్పారావు, శ్రీను,అంజి, నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News