మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పిలుపుమేరకు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో విభిన్న ప్రతిభావంతులకు మూడు చక్రాల సైకిళ్లను అందజేసినట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బందెల కిరణ్ రాజు సోమవారం తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం నుంచి ఇబ్రహీంపట్నం, కవులూరు, వెల్వడం, తోలుకోడు గ్రామాల్లోని 8మంది లబ్ధిదారులకు ఒక్కొక్కటి చొప్పున మూడు చక్రాల సైకిళ్ళను అందజేసినట్లు వెల్లడించారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News