Breaking News

Tag Archives: nuzividu

ప్రతి గ్రామంలో సుపరిపాలన అందించడమే సియం. జగన్ ధ్యేయం : ఎమ్మేల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు

నూజివీడు, ఆగష్టు, 20 : ప్రజా సంక్షేమ పాలనను పేద ప్రజల వద్దకు తీసుకువచ్చి సుపరిపాలన అందించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తపన అని శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో శుక్రవారం 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ సచివాలయ భవనాన్ని శాసనసభ్యులు లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ గ్రామ సచివాలయాల ద్వారా రాష్ట్రంలోని ప్రతీ పేదవాడికి సంక్షేమ పాలనను తీసుకు …

Read More »

గన్నవరం విమానాశ్రయం విస్తరణకు భూములు అందించినవారు తమ భూముల డాక్యుమెంట్లు ధృవీకరించుకోవాలి : ఆర్డీవో కె. రాజ్యలక్ష్మి

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూములు అందించిన వారు తమ డాక్యుమెంట్లను సంబంధిత రెవెన్యూ అధికారులతో ధృవీకరించుకోవాలని ఆర్ డివో కె. రాజ్యలక్ష్మి విజ్ఞప్తి చేశారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణకు భూములు అందించిన అల్లాపురం, బుద్ధవరం, దావాజీగూడెం గ్రామాలకు చెందిన వారిలో ఇంతవరకు 250 మంది మాత్రమే తమ భూములను సంబంధించిన డాక్యుమెంట్లను అధికార్ల వద్ద ధృవీకరించుకున్నారని, మిగిలిన వారు తమ దగ్గరలోని తాహశీల్దారు కార్యాలయంలో కానీ లేదా నూజివీడు సబ్ కలెక్టరు కార్యాలయంలో సంబంధిత అధికార్లకు తమ …

Read More »

పేదరికం ఉన్నత విద్యకు అడ్డు కాకూడదు… : ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : పేదరికం ఉన్నత విద్యాభ్యాసానికి అడ్డు కాకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా పాలసీకి శ్రీకారం చుట్టిందని శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి, విద్యార్దినులకు జగనన్న విద్యా కానుకగా పాఠ్య పుస్తకాలు, నోట్స్ పుస్తకాలు, 3 జతల యూనిఫారం, డిక్షనరీ, షూస్, బ్యాగ్ , తదితర విద్యా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్య అతిధిగా …

Read More »

విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్ గా తీర్చిదిద్దెందుకు విద్యా వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టాం : విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్ గా తీర్చిదిద్దెందుకు విద్యా వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర విద్య శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. స్థానిక ఎమ్మార్ ఏ ఆర్ పీజీ కేంద్రంలో 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అకాడమిక్ బ్లాక్ నిర్మాణపనులకు బుధవారం మంత్రి శంఖుస్థాపన చేసారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని నమ్మిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం లోని ప్రభుత్వ …

Read More »

మండలంలో పర్యటించని ప్రత్యేక అధికారులపై చర్యలు : మండల ప్రత్యేకాధికారులకు జిల్లా కలెక్టరు జె.నివాస్ హెచ్చరిక

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : మండలంలో పర్యటించని మండల ప్రత్యేక అధికారులపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టరు జె.నివాస్ హెచ్చరించారు. వ్యవసాయం, గృహ నిర్మాణం, కోవిడ్ నియంత్రణ, స్పందన ధరఖాస్తుల పరిష్కారం, తదితర అంశాలపై గురువారం స్థానిక తాహశీల్దారు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టరు సమీక్షించారు. ఈ సందర్భంగా వీరులపాడు మండల ప్రత్యేక అధికారి అయిన నెడ్ క్యాప్ అధికారిని కలెక్టరు వివరాలు అడగగా గురువారం విజయవాడలో సమీక్షా సమావేశం కారణంగా మండల పర్యటనకు రాలేదని, విజయవాడ రూరల్ మండలం …

Read More »