-పాఠశాల విద్యాశాఖ కమీషనర్ విజయ్ రామరాజు.వి IAS., -మూడు రోజుల పాటు టీచర్లకు రాష్ట్ర స్థాయి క్రికెట్, త్రోబాల్ పోటీలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆటలు శారీరక, మానసిక ఆరోగ్యానికి అవసరమని, ప్రతి పాఠశాల నుండి విద్యార్థులను జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ విజయ్ రామరాజు. వి IAS., అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో డాక్టర్స్ స్పోర్ట్స్ అకాడమీలో ఉపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి లీప్ క్రికెట్ టోర్నమెంట్, మహిళా టీచర్లకు త్రోబాల్ పోటీలకు …
Read More »Tag Archives: vijayawada
భారతీయ వాయుసేన ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ*ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహణ
-ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మరియు -దేశ సేవలో పాల్గొనే అవకాశాన్ని అంది పుచ్చుకోవాలి -ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాల భారత వాయు సేన భర్తీ అధికారి వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత వాయు సేన (ఇండియన్ ఎయిర్ ఫోర్స్) లో “అగ్ని వీర్ -వాయు” గా భర్తీ చేసేటందుకు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ ని మార్చ్ నెలలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్వహించబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ & …
Read More »ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (AIDSO) ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా ప్రధమ విజయవాడ జోన్ విద్యార్థుల మహాసభలను స్థానిక ప్రెస్ క్లబ్ నందు నిర్వహించడం జరిగింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా విజయవాడలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికై విద్యార్థుల మహాసభలను ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్య ఉపన్యాసకులుగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు వి హరీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ …
Read More »సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంపుకు అనూహ్య స్పందన…
-ఎమ్మెల్యే సుజనా చౌదరి సేవలను కొనియాడిన కూటమి నేతలు.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి సేవలు ఎనలేనివని కూటమి నేతలు కొనియాడారు. ఇటీవల ఎమ్మెల్యే సుజనా చౌదరి సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు మొబైల్ క్లినికల్ వ్యాన్ లను పశ్చిమ ప్రజల కోసం ఏర్పాటు చేయడం జరిగింది.. ఈ మెడికల్ వ్యాన్ల ద్వారా నేటి నుంచి మొబైల్ మెడికల్ క్యాంపులను ప్రారంభించారు. భవానీపురం 42 వడివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలోని 300, 400 చదరపు అడుగుల …
Read More »పశ్చిమలో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ కమిషనరేట్ లో డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమం. 12వ రోజు సైకిల్ యాత్ర కార్యక్రమం జరిగింది. పశ్చిమ నియోజకవర్గంలోని భవానిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత వైభవంగా కార్యక్రమం జరిగింది. శనివారం యాత్ర 17 కిలోమీటర్ల మేరకు యాత్రను కొనసాగించారు. ఇప్పటి వరకు 142 కిలోమీటర్లు యాత్రను కొనసాగించారు. శివాలయం సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర …
Read More »ఘనంగా గౌతమ్ స్కూల్ 38వ వార్షికోత్సవ కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాండ్రంకి గౌతమ్ విద్యాసంస్థల దుర్గాపురం బ్రాంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గౌతమ్ స్కూల్ 38వ వార్షికోత్సవ (అన్యువల్ డే) కార్యక్రమం ఘనంగా జరిగింది. శనివారం 33వ డివిజన్ BRTS రోడ్డు, ఘంటసాల సంగీత కళాశాల ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ… విద్య ద్వారానే విద్యార్థుల భవిష్యత్తు ప్రకాశవంతంగా మారుతుందని తెలిపారు. విద్యార్థుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం …
Read More »తిరుమల తిరుపతి దేవస్థానం లకు కల్తీ అయింది అనేది వాస్తవం…
-ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల తిరుపతి దేవస్థానం లకు కల్తీ అయింది అనేది వాస్తవమని NDBB తన నివేదికలో స్పష్టంగా వెల్లడించిందని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను అన్నారు. శనివారం విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల గాంధీ, పార్టీ రాష్ట్ర నాయకులు గంజి చిరంజీవి తో కలిసి …
Read More »గుంటుపల్లి లో రూరల్ ఇంక్యూబేషన్ స్కిల్oగ్ అండ్ ఎంటర్ప్రేన్యూర్ సెంటర్ ఎన్టీఆర్ వికాస జాబ్ మేళా నిర్వాహణ విజయవంతం..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), ఎన్టీఆర్ వికాస, జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు శనివారం గుంటుపల్లిలో జాబ్ మేళా” నిర్వహించారు జిల్లా ఉపాధి కల్పన అధికారి సి. మధుభూషణ్ రావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు సంయుక్తంగా తెలియజేసారు. ఈ జాబ్ మేళా లో మొత్తం 91 మంది నిరుద్యోగ యువత హాజరు కాగా వారిలో …
Read More »ఐబీఎం క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం
–క్వాంటం వ్యాలీతో నోబెల్ లక్ష్యానికి ఆంధ్రప్రదేశ్ చారిత్రాత్మక ముందడుగు -మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతిలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వంలో ఐబీఎం (IBM) క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం కావడం ఆంధ్రప్రదేశ్ సాంకేతిక చరిత్రలో మైలురాయిగా నిలిచిందని మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి క్వాంటం టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న ఐబీఎంతో భాగస్వామ్యం ద్వారా ఈ సెంటర్ స్థాపన, అమరావతిని …
Read More »రాష్ట్రవ్యాప్తంగా ‘సపోర్ట్ పర్సన్స్’ నియామకానికి ప్రభుత్వం నిర్ణయం…
–బాలల సంక్షేమ శాఖ సంచాలకులు ఎం. వేణుగోపాల్ రెడ్డి. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : లైంగిక వేధింపులకు గురైన బాలలకు అండగా నిలిచేందుకు, వారికి న్యాయపరమైన, మానసిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు. పోక్సో (POCSO) చట్టం-2012, సెక్షన్ 39 ప్రకారం.. బాధితులకు కేసు విచారణకు ముందు, విచారణ సమయంలో మార్గదర్శకత్వం మరియు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు “సపోర్ట్ పర్సన్స్” (Support Persons)ను నియమించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బాలల సంక్షేమం, సంస్కరణల సేవలు మరియు వీధిబాలల సంక్షేమ శాఖ సంచాలకులు (FAC) …
Read More »
Prajavartha Online Telugu News