రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బాల్యవివాహం జరిపించుట, వాటిని ప్రోత్సహించుట చట్ట రీత్యా నేరమని, ఇందుకు సంబంధించి భాగస్వామ్యం అయ్యే వ్యక్తుల పై కేసులు నమోదు చెయ్యడం జరుగుతుందనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. రాజానగరం మండలం కొ త్తతుంగపాడు గ్రామంలో బాల్యవివాహం జరిగిన ఘటనపై జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. ఈ నేపధ్యంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజ్ కుమార్ క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసిన సందర్భంలో గ్రామానికి చెందిన యువకుడు(27) అదే గ్రామానికి చెందిన మైనర్ బాలిక తో వివాహం జరిగిందని విషయంలో విచారణ లో నిర్దారణ చేసుకోవడం జరిగింది. కొత్త తుంగపాడు బాల్య వివాహాల కేసు పై ఎఫ్ఐఆర్: Cr.No-199/2024 U/s 9,10,11(1) ఆఫ్ బాల్య వివాహ నిషేధ చట్టం-2006 ను అనుసరించి డిసెంబర్ 28 న రంగంపేట పోలీస్ స్టేషన్ కేసు నమోదు చెయ్యడం జరిగిందనీ జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజ్ కుమార్ వెల్లడించారు. జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టడం జరిగిందన్నారు
Tags Rājamahēndravaraṁ
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …