Breaking News

సచివాలయ సిబ్బంది పాత్ర కీలకం… : మేయర్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్షేమ పథకాలను అర్హులకు అందించడంలో సచివాలయ సిబ్బందిదే కీలక పాత్ర అని విజ‌య‌వాడ నగర మేయర్ శ్రీ‌మ‌తి రాయన భాగ్య‌ల‌క్ష్మి తెలిపారు. నగరంలోని 46 డివిజ‌న్ పరిధిలోని 143వ సచివాలయంను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయాల సిబ్బందితో మేయర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ ప్రజలకు పరిపాలనను చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి సచివాలయ వ్యవస్థను ప్రవేశ పెట్టారన్నారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా సచివాలయ సిబ్బంది భాద్యతగా విధులు నిర్వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు, సంక్షేమ పథకాలు సచివాలయాల ద్వారా అందించాలని కార్యదర్శులకు సూచించారు. ప్రతి రోజు ప్రజల నుండి వస్తున్న సమస్యల అర్జీలను సంబంధిత అధికారులకు చేరవేసి వారి నుండి వచ్చిన వివరాలను అర్జి దారునికి తెలియపరచాలన్నారు. అక్కడున్న రిజిస్టర్ లను, సిబ్బంది హాజరు పుస్తకాలను మేయర్ తనిఖీ చేశారు. ప్రతి సచివాలయంలో ప్రజలకు అందిస్తున్న సేవలనూ, సంక్షేమ పథకాలపై చర్యలను, వాటి నిర్వహణ సమగ్రంగా నిర్వహించాలని కార్యదర్శులను ఆదేశించారు. సచివాలయ కార్యదర్శులు అందరూ ప్రతిరోజు సచివాలయంలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి మెరుగైన సేవలు అందించాలన్నారు.

Check Also

జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి

-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *