అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త:
అద్దంకి పట్టణంలోని 26వ వార్డులో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి క్యూ లైన్లో నిలబడి ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి, రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతోందని తెలిపారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో పోటీ చేసిన అభ్యర్థులందరూ విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
అద్దంకిలో ఓటు హక్కు వినియోగించుకున్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
