Breaking News

జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించడంలో కృష్ణాజిల్లాను ప్రథమంలో ఉంచాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పొదుపు సంఘాల మహిళలకు అక్టోబరు 7వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా 2వ విడత పంపిణీ చేపట్టనున్న దృష్ట్యా అక్టోబరు 8 నుంచి 17వ తేది వరకు 10 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల స్థాయి అధికారులకు జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) లొతోటి శివశవకర్ సూచించారు. స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి గురువారం వైఎస్ఆర్ ఆసరా, జగనన్న స్వచ్చ సంకల్పం, పెన్షన్స్ పరిశీలన, వాలంటీర్ల రిక్రూట్మెంట్ తదితర అంశాలపై యంపిడిఓలు, మున్సిపల్ కమిషనర్లు, డిఎల్ పిఓలు, పిఆర్ఆర్ డి ఇఓలు తదితర మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్లు ఎల్. శివశంకర్, కె. మోహన కుమార్ సమీక్షించారు.
ఈ సందర్భంగా జెసి (అభివృద్ధి) ఎల్. శివశంకర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసరా 2వ విడత పంపిణీ సంబందించి అక్టోబరు 8వ తేదీ నుంచి 17 తేది వరకు నిర్వహించే కార్యచరణ వివరాలను ఆయా మండలాల వారిగా డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ కు సంబంధిత యంపిడివోలు, మున్సిపల్ కమీషనర్లు పంపాలన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించడంలో కృష్ణాజిల్లాను ప్రథమంలో ఉంచాలన్నారు. కొత్తగా మంజూరుకు వచ్చిన పెన్షన్లను, వివిధ కారణాలతో నిలిచిన పెన్షన్లను క్షుణ్ణంగా పునపరిశీలన చేసి ఎటువంటి ఆరోపణలకు తావులేకుండా వివరాలు సమర్పించాలన్నారు. జిల్లాలో అయా క్లస్టర్లలో వాలంటీర్ల ఖాళీలను గుర్తించి వెంటనే నివేదిక అందజేస్తే వాటి నియామకానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
జాయింట్ కలెక్టర్ ( సంక్షేమం) కె. మోహన్ కుమార్ మాట్లాడుతూ వైఎస్సార్ ఆసరా 2వ విడత పంపిణీ సందర్భంలో నిర్వహించే అవగాహన కార్యక్రమంలో దిశ యాప్ ప్రయోజనాలు, దానిని డౌన్ లోడ్ చేసుకునే విధానాలను, ప్రభుత్వం మహిళ సాధికారతకు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను వివరించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఐదింటికి సంబంధించి డిజిటల్ పేమెంట్ రశీదు (బయోమెట్రిక్ వేలిముద్ర) ప్రగతి పురోగతి చేయాలని ఇందుకోసం ఒకటి రెండు రోజులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. త్వరలో ప్రారంభించనున్న ఇబిసి నేస్తం, తోపాటు జగనన్న చేదోడుకు సంబంధించిన అర్హుల జాబితాను ప్రదర్శించడంతోపాటు పరిశీలన చేయాలన్నారు. వైఎస్ఆర్ ఆసరాకి సంబంధించి అక్టోబరు 2వ తేదిలోపు సంఘాల సమావేశాల తీర్మానాలు చేసి ఐఎఫ్ఎస్ సీ కోడ్ వివరాలు పంపాలన్నారు. వైఎస్సార్ బీమా క్లయిమ్ లు సెటిల్ మెంట్ విషయంలో చారవ చూపాలన్నారు. జిల్లాలో 1140 క్లయిమ్ లు రిజిస్టర్ కాగా వాటిలో 90 శాతం క్లయిమ్ కు సంబంధించిన సర్టిఫికెట్లను అప్లోడ్ చేయడం జరిగిందన్నారు. మిగిలినవి కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
సమావేశంలో డిఆర్‌డీఏ పిడి యం. శ్రీనివాసరావు, జడ్పీ సిఇఓ పిఎస్ సూర్యప్రకాశరావు, డిపిఓ జ్వోతి, ద్వామా పిడి జివి, సూర్యనారాయణ, యుసిడి పిడి జె. అరుణ తదితరులు పాల్గొన్నారు.

Check Also

డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన

-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *