మురసు తుఫాను ప్రభావం నేపథ్యంలో నవంబర్ 3న ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు

-జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
మురసు తుఫాను ప్రభావంతో మంగళవారం నవంబర్ 3వ తేదీ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు.

ఈ మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు నవంబర్ 3వ తేదీన సెలవు వర్తిస్తుందని స్పష్టం చేశారు.
జిల్లాలోని అన్ని యాజమాన్యాల విద్యాసంస్థలు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని, ఆదేశాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

తుఫాను ప్రభావం తగ్గే వరకు విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.