Breaking News

పాలు కల్తీ ఘటనకు సంబంధించి అవసరమైన అన్ని వైద్య చర్యలు కొనసాగిస్తున్నారు….

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం పట్టణంలో జరిగిన పాలు కల్తీ ఘటనకు సంబంధించిన ఆరోగ్య సమస్యల నేపథ్యంలో డెల్టా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఎస్. రామలక్ష్మి (వయసు 73) ఆదివారం ఉదయం 9.35 గంటలకు తీవ్ర మూత్రపిండ వైఫల్యంతో దురదృష్టవశాత్తు మరణించినట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కె. వెంకటేశ్వరరావు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యులకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రస్తుతం మొత్తం 9 మంది రోగులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. మిగిలిన రోగుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షణలో ఉంచి, అవసరమైన అన్ని వైద్య చర్యలు కొనసాగిస్తున్నామని వైద్యులు వెల్లడించారు.

ఆసుపత్రుల వారీగా రోగుల వివరాలు ఇలా ఉన్నాయి:
KIMS Hospital – 4 మంది,
Delta Hospital – 1 వ్యక్తి,
Rainbow Children’s Hospital – 3 మంది,
Ravi Chaitanya Hospital – 1 వ్యక్తి.

రోగులు సంబంధిత నిపుణుల వైద్యుల పర్యవేక్షణలో సముచిత వైద్య చికిత్స పొందు తున్నారని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని కె. వెంకటేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల ప్రకారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని దగ్గరగా పర్యవేక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *