విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ తూర్పు నియోజకవర్గం శిఖామణి సెంటర్ వద్ద బుధవారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై టీడీపీ నేత పట్టాభి రాం చేసిన వ్యాఖ్యలు ని ఖండిస్తూ వైసీపీ రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబు ఆధ్వర్యంలో శిఖామణి సెంటర్ లో రోడ్డు పై నిరసన వ్యక్తం చేసిన వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు. కడియాల బుచ్చిబాబు మాట్లాడుతూ జగన్ కి దక్కుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు అని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై పట్టాభి చేసిన వ్యాఖ్యలు క్షమించరానివి. ముఖ్యమంత్రి పై నీచంగా మాట్లాడిన పట్టాభిని టీడీపీ నేతలు సమర్ధించటం దుర్మార్గం అని అన్నారు. మత్తు పదార్థాలు రవాణా పేరుతో అవాస్తవాలు ప్రచారం చేస్తూ రాష్ట్ర పరువుని దిగజరుస్తున్నారు అని, యువతని తప్పుడు మార్గంలో వెళ్లాలని ప్రోత్సహించే విధంగా పట్టాభి మాటలున్నాయి అని అన్నారు. టీడీపీ నేతలు ఎన్ని దిగజారుడు రాజకీయాలు చేసిన ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అని బుధవారం వాళ్లు పిలుపు నిచ్చిన బంద్ ను ప్రజలు తిప్పికొట్టడం తోనే అర్ధం అయింది అని అన్నారు.
Tags vijayawada
Check Also
త్వరలోనే విశాఖపట్టణం, తిరుపతిలలో పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు
-సచివాలయంలో పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి …