Breaking News

రాష్ట్రాన్ని పర్యాటక హబ్ గా తీర్చిదిద్దుతాం…

-ఏపి టిడిసి చైర్మన్ ఏ. వరప్రసాద్ రెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ ను టూరిజం హబ్ గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ ఏ. వరప్రసాద్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ కు నియమితులైన 12 మంది డైరెక్టర్లు విజయవాడ బెర్మ్ పార్క్ లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపి టూరిజం కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టరు సత్యనారాయణ ఛైర్మన్ డా. ఆరిమండ వరప్రసాద్ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలో హోటళ్లు, రిస్సార్ట్ లు, బోటింగ్ , కాన్ఫరెన్స్ హాల్స్ లో పర్యాటకులకు ఆకర్షణీయమైన టూరిజం ప్యాకేజీలను అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత ప్రాధాన్యత కలిగిన పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఆశయాలకు అనుగుణంగా టూరిజం కార్పోరేషన్ డైరెక్టర్లు కృషిచేయాలన్నారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టరు సత్యనారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ రాష్ట్రంలోని 13 ప్రాంతాలలో పర్యాటక కేంద్రాలను ఏర్పాటు చేసి 52 పడవలతో బోటింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోందన్నారు. దిండి వద్ద రెండు హౌస్ బోట్లు, బొర్రాగుహలు, బెలం గుహలు, తదితర 5 ప్రదేశాలలో పర్యాటకులను ఆకర్షించేలా అధునాతన సౌండ్ అండ్ లైటింగ్ సిస్టమ్ నిర్వహిస్తున్నామన్నారు. పర్యాటకరంగాన్ని మరింత అభివృద్ధి చేయడంలో డైరెక్టర్లు కృషి చేయాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ డైరెక్టర్లుగా నెల్లిమర్ల నియోజకవర్గంకు చెందిన ఆర్. శ్రీనివాసరావు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంకు చెందిన ఆర్. రేవతి తూర్పు నియోజకవర్గంకు చెందిన కె. శ్రీలక్ష్మి గుడివాడ నియోజకవర్గానికి చెందిన యన్. సత్యనారాయణ గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పఠాన్ జమీరా బేగం బద్వేలు నియోజకవర్గానికి చెందిన యస్. అల్లాభాషా జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన యల్. జయన్న పోడూరు నియోజకవర్గానికి చెందిన వి. సాయి కిషోర్ రెడ్డి పులివెందుల నియోజకవర్గానికి చెందిన బి.ప్రవీణ్ కుమార్ రెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గానికి చెందిన కె.లక్ష్మీదేవి అనంతపురం అర్బన్ నియోజకవర్గానకి చెందిన బి. జాహ్నవి తంభళ్లపల్లి నియోజకవర్గానికి చెందిన యం. భాస్కర రెడ్డిలు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *