Breaking News

కలిసి పని చేద్దాం… కలిసి నేర్చుకుందాం… సమస్యలను పరిష్కరిస్తూ SIR ప్రక్రియను వేగవంతం చేద్దాం…

-డిప్యూటీ డీఈఓ, సెంట్రల్ ఈఆర్వో, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అధికారులు, సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేస్తూ, ఒకరికొకరు సహకరించుకుంటూ, ఎదురయ్యే సమస్యలను పరస్పరం పంచుకుని పరిష్కరించుకుంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను మరింత వేగవంతంగా పూర్తి చేయవచ్చని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్, సెంట్రల్ ఈఆర్వో, డిప్యూటీ డీఈఓ ధ్యానచంద్ర తెలిపారు.

బుధవారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా మ్యాపింగ్, డిజిటలైజేషన్ ప్రక్రియ పురోగతిని పరిశీలించేందుకు పాయకాపురం, పాత రాజరాజేశ్వరి పేట, గాంధీనగర్ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులకు అవసరమైన మార్గదర్శకాలు అందించారు.

ముందుగా గాంధీనగర్‌లోని కందుకూరి కళ్యాణ మండపంలో ఏఈఆర్వో, పర్యవేక్షణ ఇంజనీర్ (ప్రాజెక్ట్స్) పి. సత్యకుమారి ఆధ్వర్యంలో పనిచేస్తున్న బీఎల్ఓలతో మ్యాపింగ్, డిజిటలైజేషన్ ప్రక్రియపై ప్రత్యక్ష సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బూత్ లెవల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను ఒక్కొక్కటిగా తెలుసుకున్నారు. అదే సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల ఈఆర్వోలు, విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని మూడు నియోజకవర్గాల ఏఈఆర్వోలు, బీఎల్ఓలతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి తగిన దిశానిర్దేశం చేశారు.

ప్రతి బీఎల్ఓ ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కార మార్గాలను అందరికీ తెలియజేస్తూ, ఒకరు నేర్చుకున్న విధానాన్ని మిగతావారితో పంచుకోవాలని సూచించారు. అలాగే ఏఈఆర్వోలు, సూపర్వైజర్లు స్వయంగా ఒక ఎన్యుమరేషన్ ఫారాన్ని మ్యాపింగ్ చేసి, డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్వహించడం ద్వారా ఎదురయ్యే సాంకేతిక అంశాలను అర్థం చేసుకుని, బీఎల్ఓలకు సులభంగా మార్గనిర్దేశం చేయాలని తెలిపారు. దీనివల్ల SIR ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందన్నారు.

విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అన్ని నియోజకవర్గాల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ, బీఎల్ఓలకు మ్యాపింగ్, డిజిటలైజేషన్ ప్రక్రియపై నిరంతరం అవగాహన కల్పిస్తూ పనులను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు.

అనంతరం పాయకాపురం ప్రాంతంలో ఏఈఆర్వో చీఫ్ సిటీ ప్లానర్, కె. సంజయ్ రత్నకుమార్, బీఎల్ఓల పనితీరును పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ఓటరు నింపిన ఎన్యుమరేషన్ ఫారాన్ని స్వీకరించారు. ఏఈఆర్ఓ కే.సంజయ్ రత్నకుమార్, అక్కడికక్కడే మ్యాపింగ్, డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేసిన పని తీరును పరిశీలించారు.

ప్రతి అర్హత కలిగిన ఓటరును ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకుండా నిర్ణీత గడువులోపు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను పూర్తి చేయాలని, ఇందుకు అవసరమైన సహకారం అందిస్తూ ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, బీఎల్ఓలు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ (ఎస్ జి ఎస్ డబ్ల్యూ) శకుంతల, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోపాలకృష్ణ, సూపర్వైజర్లు, బిఎల్వోలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *