Breaking News

పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం పాత రాజరాజేశ్వరిపేట పరిసర ప్రాంతాలని పర్యటించి ఎన్టీఆర్ భరోసా పింఛను లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు.

ఆ ప్రాంతాల్లో గల పింఛను లబ్దిదారుల ఆధార్ కార్డు పరిశీలించి, ఫేస్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్ ఆర్ ఎస్ ) ద్వారా చెక్ చేసి పింఛన్ డబ్బులు అందించారు. వారితో మాట్లాడి వాళ్లకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు, ప్రతినెల పింఛను వస్తుందా లేదా, ఇంటికి వచ్చి ఇస్తున్నారా లేదా, ఎంత డబ్బులు ఇస్తున్నారు లాంటి ప్రశ్నలు వాళ్ళని అడిగి, ప్రతినెలా ఇస్తున్న పింఛను తీరును పరిశీలించారు.

ఆ ప్రాంతంలో గల ప్రజలతో స్వయంగా మాట్లాడి ప్రతినెల పెన్షన్ వస్తుందా లేదా? ఎంత పెన్షన్ వస్తుంది? ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అని మాట్లాడితెలుసుకున్నారు. ప్రతి నెల సమయానికి పెన్షన్ సిబ్బంది అందిస్తున్నారని ఎటువంటి సమస్యలు లేదని వారు తెలుపగా సంతృప్తి చెందారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అక్కడున్న పింఛన్ లబ్ధిదారులకు స్వయంగా తానే ఎఫ్ ఆర్ ఎస్ తీసి పింఛన్ డబ్బులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మధ్యాహ్నం మూడు గంటల వరుకు, సర్కిల్ వన్ పరిధిలో 19,751 పెన్షన్ లకు గాను 18,371, సర్కిల్ 2 పరిధిలో 25,147 పెన్షన్ లకు గాను 23,429, సర్కిల్ 3 పరిధిలో 19,860 పెన్షన్ లకు గాను 18,403, మూడు సర్కిల్స్ పరిధిలో మొత్తం 64,758 పెన్షన్ లకు 60,203 పెన్షన్ల పంపిణీ చేశారని, అంటే దాదాపు 92% పెన్షన్ పంపిణీ చేశారని తెలిపారు.

తదుపరి పాత రాజరాజేశ్వరి పేట లోని జేపీ అపార్ట్మెంట్స్ ను పరిశీలించి అక్కడ డ్రైనేజ్ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టాలని, మురుగుపారుదలకు ఏమైనా అంతరాయం ఉంటే వెంటనే వాటిని తొలగించి మురుగుపారుదలకు ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ సత్యనారాయణ, సిడిఓ శ్రీకాంత్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె. శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *