Breaking News

అభివృద్ధి పనులను పరిశీలన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పరిధిలోని బిఆర్ స్టేడియంలో మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసేలా రోజువారీ యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. బుధవారం బిఆర్ స్టేడియంలో పర్యటించి, క్రీడా ప్రాధికారిక సంస్థ అధికారులు, జిఎంసి ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్ల ప్రతినిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత స్టేడియంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకొని, ప్రత్యక్ష్యంగా పరిశీలించి, మాట్లాడుతూ, బిఆర్ స్టేడియం పనుల వేగవంతంకు క్షేత్ర స్థాయిలో ఏ సమస్య లేనందున కాంట్రాక్టర్ తగిన కార్మికులు, సిబ్బందిని సిద్దం చేసుకొని వేగంగా చేయాలని, జిఎంసి నుండి పర్యవేక్షణకై ఈఈ, డిఈఈ, ఏఈలకు విధులు కేటాయించామన్నారు. అభివృద్ధి పనులు నిర్దేశిత డిజైన్ మేరకు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తి అయ్యేలా డిఎస్డీఓ, జిఎంసి అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. పనుల పురోగతిపై రోజువారీ సమీక్ష చేసి, తమకు నివేదిక ఇవ్వాలని ఈఈని ఆదేశించారు.
పర్యటనలో డిఎస్డీఓ అఫ్రోజ్ ఖాన్, జిఎంసి డిఈఈ శ్రీనివాస్, ఏఈ గౌస్, క్రీడా ప్రాధికారిక సంస్థ అధికారులు, కాంట్రాక్టర్ ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *