Breaking News

అబద్దాల సత్యవతి లక్ష్మి పార్వతి..

-ఉపసంహారించుకోక పోతే పరువు నష్టం దావా
-అట్రాసిటీ కేసు కూడా నమోదు
-తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్. డి. విల్సన్ @ శరత్ చంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అబద్దాలే జీవితం గా బ్రతుకుతున్న లక్ష్మి పార్వతి తెలుగు అకాడమీ మీద అబద్దపు కారుకూతలు కూయడాన్ని తీవ్రంగా .. గర్హిస్తున్నాం. ఆమె హయాంలో ఆమెకు నచ్చిన నాలుగు సంస్థలకు ప్రింటింగ్ బాధ్యతలు ఇచ్చి ముడుపులు తీసుకున్నారు తప్పా ఎక్కడా పారదర్శకత పాటించలేదు. మా హయాంలో ఓపెన్ టెండర్లు పిలిచాము. లక్ష్మీ పార్వతి హయాంలో జరిగిన అవకతవకలపై సంపూర్ణ విచారణ జరపాలి అని డిమాండ్ చేస్తున్నాం. కొన్ని సంస్థలకే ఎలా ఇచ్చారు. లక్ష్మి పార్వతి హయాంలో ఎంత ఆదాయం అకాడమీ కి వచ్చిందో తెలియ చేయాలి. ప్రస్తుతం ఓపెన్ టెండర్లు ద్వారా వచ్చిన ఆదాయం కూడా బేరీజు వేసుకోవాలి. విక్రమ్.. వి జి ఎస్ పబ్లిషర్లు వచ్చింది వైసీపీ హయాంలోనే ఆమె వాళ్ళను అడ్డుకున్నాను అనడం పెద్ద అబద్దం.

గాసిప్స్ మీద బ్రతక వద్దు
ఎవరో తప్పుడు సమాచారం రాసిస్తే గడ.. గడ చదవడం లక్ష్మీ పార్వతి భావ దారిడ్ర్యం.
తమిళనాడు తరహా లో వర్చువల్ అకాడమీ పెడితే బావుంటుంది అన్నది ఒక ప్రతి పాదన. దీనికి డి. పి. ఆర్ తయారు చెయ్యమని ఇచ్చిన మంత్రి ఆదేశాల మీద మాత్రమే తయారు చేశాం తప్పా.. ఒక్క రూపాయి కూడా అకాడమీ నుండీ ఖర్చు చెయ్యలేదు. సమాచార సాంకేతిక విప్లవంలో భాగంగా సోషల్ మీడియా ప్రజలకు అత్యంత చేరువగా ఉంటే, యూట్యూబ్ ఛానల్ పెట్టడాన్ని విమర్శించడం ఆమె అజ్ఞానానికి నిదర్శనం. పెట్టని యూట్యూబ్ కి నిధులు ఎలా కేటాయిస్తాం? అసలు యూట్యూబ్ ఛానల్ గురించి పూర్తిగా తెలుసుకొని మాట్లాడటం మంచిది.

తప్పుడు కూతలు కూస్తే ఎలా?
లోకేష్ హయాంలో విద్యాశాఖ అభివృద్ధి
నాడు నేడు పేరుతో పాఠశాల లకు రంగులు వేయడం తప్పా.. చేసిన అభివృద్ధి సూన్యం.
లోకేష్ నిడమర్రు తరహా లో అంతర్జాతీయ విలువలతో పాఠశాలలు కనీసం జిల్లాకు ఒకటి ఏర్పాటు చేయాలి అనుకోవడం ఆయన పని తీరుకు నిదర్శనం.
లోకేష్ అకాడమీ కి మార్గ దర్శనం చేస్తారు తప్పా ఎప్పుడూ అకాడమీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోరు.లోకేష్ కుటుంబం పై వున్న వ్యక్తి గత ద్వేషం తో కూసే కారుకూతలు ఆమె దిగజారుడు స్వభావం కి నిదర్శనం.వి జి. ఎస్ పేరుతో పిడిఎఫ్ రాగానే పోలీసులకు పిర్యాదు చేసి అకాడమీ చిత్తశుద్ధి చాటుకుంది.అక్కడ నుండీ లీక్ కాలేదు అని పోలీసు శాఖ నివేదిక ఇస్తే.. దాన్ని తప్పు పడితే ఎలా? దర్యాప్తు సంస్థ లను అవహేళన చేస్తే ఎలా?
రేపు సిబిఐ జగన్ కు క్లీన్ షీట్ ఇస్తే సిబిఐ ను జగన్ కొనుగోలు చేసినట్టా?

లక్ష్మీ పార్వతి.. జగన్ యాంటీ దళిత్
ఒక దళితుడు అకాడమీ కి చైర్మన్ గా ఉంటే భరించలేక ఎవరో విల్సన్ అని ఏకవచన ప్రయోగం చేసింది. సామర్ధ్యం లేకుండానే నాడు వై. ఎస్ రాజశేఖరరెడ్డి చైర్మన్ పదవి ఇచ్చారా?ఆయన హయాంలో ఒక్క రూపాయి అవినీతి చేయని వ్యక్తి పై ఇప్పుడు కామెంట్స్ చేయడం లక్ష్మీ పార్వతి దిగజారుడు తనం కాదా? ఒక దళితుడి పై ఆరోపణలు చేయించడం జగన్ యాంటీ దళిత్ కాన్సెప్ట్ కి నిదర్శనం.
జగన్ హయాంలో స్వర్ణయుగం నడిచిందా? నవ్వి పోతారు. నాడు కే. సి ఆర్ తో కుమ్మక్కు అయ్యి తెలంగాణా నుండీ అకాడమీకీ రావాల్సిన నిధులు రాబట్టడం లేదు.మా హయాంలో తెలంగాణా నుండి రావాల్సిన నిధుల కోసం లేఖలు వ్రాస్తున్నాం. అంతేకాకుండా ప్రైవేట్ కళాశాలలు కూడా అకాడమీ బుక్స్ మాత్రమే కొనాలని ప్రతిపాదన పెట్టడం జరిగింది. అకాడమీ అభివృద్దే ధ్యేయంగా ముందుకూసాగుతున్నాము. మీరు ఇంకా 1995 దశకంలో ఉన్నారు. మీ అవుట్దేటేడ్ ఆలోచనలు మానుకోండి.
అకాడమీ ప్రతిష్ట దెబ్బ తీసేలా మాట్లాడిన లక్ష్మీ పార్వతి తన వ్యాఖ్యలు ఉప సంహారించుకోకపోతే పరువు నష్టం దావా తో పాటు అట్రాసిటీ కేసు నమోదు చేస్తాను అని హెచ్చరిస్తున్నాను.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *