Breaking News

గూడూరును తిరిగి నెల్లూరు జిల్లాలో కలిపిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు

-గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి సీఎం చంద్రబాబు హయాంలోనే బలమైన పునాది
-గూడూరు శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్

చిల్లకూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పున్నపువారిపాలెంలో నిర్వహించిన “పేదల సేవలో ప్రజా వేదిక” కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే  పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ, గూడూరు నియోజకవర్గ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన గూడూరును తిరిగి నెల్లూరు జిల్లాలో విలీనం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

గత ప్రభుత్వం గూడూరును తిరుపతి జిల్లాలో చేర్చగా, ప్రజల మనోభావాలను గౌరవించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గూడూరును తిరిగి నెల్లూరు జిల్లాలో కలిపారని పేర్కొన్నారు.

పున్నపువారిపాలెం రహదారిని ఉపాధి హామీ పథకం ద్వారా రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.అలాగే రహదారి నిర్మాణానికి అవసరమైన అటవీ శాఖ అనుమతులు మంజూరు చేయడంలో ప్రత్యేక చొరవ చూపిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. పున్నపువారిపాలెం ప్రాంతంలో పరిశ్రమలు అధికంగా ఉన్నాయని, రహదారి నిర్మాణం అనంతరం భూముల విలువలు గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు.

గూడూరు నియోజకవర్గంలో జరిగిన ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబునాయుడు హయాంలోనే బలమైన పునాది పడిందన్నారు. మిగిలిన రహదారుల నిర్మాణం, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో రోడ్లు, డ్రెయినేజీల అభివృద్ధి, గూడూరు ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయడం, చిట్టమూరు ప్రాంత తాగునీటి సమస్య పరిష్కారం తదితర అంశాలపై ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేస్తామని ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *