Breaking News

చంద్రబాబు కృషితోనే ఏపీకి దేశంలో రెండో స్థానం

-రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న దూరదృష్టి నాయకుడు చంద్రబాబు
-నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

చిల్లకూరు, నేటి పత్రిక ప్రజావార్త :
“పేదల సేవలో ప్రజా వేదిక” కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో అభివృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలవడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృషి, దూరదృష్టి, పరిపాలనా సామర్థ్యమే ప్రధాన కారణమని పేర్కొన్నారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదని, రాష్ట్ర ప్రగతి, పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల స్థాపన, ఉపాధి అవకాశాల కల్పన కోసం ఆయన 24 గంటలూ నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. ముఖ్యమంత్రి పడుతున్న కష్టంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు కనీసం 10 శాతం భాగస్వామ్యం అయినా రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.

గూడూరు ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, గూడూరు పరిసర ప్రాంతాల్లో రహదారులను బాగా అభివృద్ధి చేశారని తెలిపారు. గూడూరుకు ఇది ఒక అదృష్టమని పేర్కొన్నారు.

క్రిస్‌సిటీలో మూడు విడతల్లో 10 వేల ఎకరాల భూసేకరణ చేపట్టి భారీ పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా పెద్దఎత్తున పరిశ్రమలు రానున్నాయని, తొలి దశలో గ్లాస్ పరిశ్రమ, ఈథనాల్ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని వెల్లడించారు. రానున్న రోజుల్లో అభివృద్ధి ఫలితాలు గూడూరు ప్రాంతంలో స్పష్టంగా కనిపిస్తాయని తెలిపారు.

నెల్లూరు జిల్లాలో అనేక పరిశ్రమలు ఏర్పాటు కానుండటంతో పాటు విమానాశ్రయం, బీపీసీఎల్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు కూడా జిల్లాకు కొత్త దిశానిర్దేశం చేయనున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా జిల్లాలో భారీ స్థాయిలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

గూడూరు పరిసర ప్రాంతాల్లో వస్తున్న పరిశ్రమల కారణంగా యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గిపోతుందని, స్థానికంగానే పుష్కలమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. జిల్లాలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు కొరత లేకుండా ప్రభుత్వం కార్యాచరణ చేపడుతోందన్నారు.

రాష్ట్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  నాయకత్వంలో పనిచేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *