Breaking News

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలికిన డా. పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ (VB-G RAM G) జాతీయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరుపతి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి తిరుపతి విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్, పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రైల్వే కోడూరులో నిర్వహించనున్న VBGRAMG జాతీయ ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలికారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *