Breaking News

120 ఏళ్ల పురాతన శివాలయంలో లక్ష్మీ గణపతి, దక్షిణామూర్తి విగ్రహాల ప్రతిష్ఠ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గవర్నర్‌పేట చల్లపల్లి బంగ్లా సమీపంలోని 120 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన పురాతన శివాలయంలో శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ దక్షిణామూర్తి విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని), ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గవర్నర్‌పేటలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం విజయవాడ నగరంలోని అత్యంత పురాతన, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన శివాలయాలలో ఒకటని పేర్కొన్నారు. శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ దక్షిణామూర్తుల అనుగ్రహంతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ఈ దివ్య విగ్రహాలను ప్రతిష్ఠించడం ద్వారా భక్తులకు మరింత ఆధ్యాత్మిక అనుభూతి, దైవదర్శన భాగ్యం కలిగే అవకాశం ఏర్పడిందన్నారు. నూతన ధర్మకర్తల కమిటీ ఆలయ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో అంకితభావంతో సేవలందిస్తున్నారని కొనియాడారు. భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధి పనులన్నింటినీ వేగంగా పూర్తి చేసి మరింత ఆధ్యాత్మిక వైభవాన్ని తీసుకురావడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య వారికి వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందించారు.
ఈ సందర్భంగా ఆలయ ఈవో, ధర్మకర్తల మండలి సభ్యులు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు భక్తులు విశేషంగా సహకరిస్తున్నారని, ఇది భక్తుల విశ్వాసానికి నిదర్శనమన్నారు. మామీద నమ్మకంతో ఈ విధంగా సేవ చేసే అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ఎంపీ, ఎమ్మెల్యే, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. దేవాలయం అభివృద్ధి తో పాటు భక్తులకు మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్స్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజర్ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, మాజీ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి, ఈవో యడ్లపల్లి సీతారామయ్య, బత్తుల కొండ, దేవరపు మాల్యాద్రి, కొంపల్లి నాని, గార్లపాటి విజయ్ కుమార్, పైడి తులసి ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *