విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కిడ్స్ బ్లోసమ్ డే కేర్ స్కూల్ గురువారం స్థానిక జివిఆర్ నగర్ 5వ లైన్ లో గొప్పగా ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవ మహోత్సవం సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ముందుగా స్కూలు యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. స్కూల్ యాజమాన్యం వారు భవిష్యత్తులో మరిన్ని బ్రాంచ్ ఓపెన్ చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ తమ వ్యాపార అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం కిడ్స్ బ్లోసమ్ డే కేర్ స్కూల్ ప్రిన్సిపల్ కే. నరేంద్ర కుమార్ మాట్లాడుతూ తమ రెండవ బ్రాంచ్ ను బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. అదేవిధంగా తమ స్కూలు లో కిడ్స్ కోసం ప్లే గ్రూపు, ప్రీ కేజీ, జూనియర్ కేజీ, సీనియర్ కేజీ అనే క్లాసులు కలవని తెలియజేశారు. అదేవిధంగా ఎక్కడా లేని తరహాలో ఏసీ ప్లే స్కూల్ ఏర్పాటు చేశామని అన్నారు. ఈ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆటలతో విద్య అనే కొత్త కాన్సెప్ట్ తో పిల్లలకు చదువు సులభతరమైన మార్గాలలో అందించడమే తమ లక్ష్యమని అదే విధంగా ఫీజులు కూడా అందరికీ అందుబాటు ధరలలో ఉంటాయని అన్నారు. అదేవిధంగా టెన్త్, ఇంటర్, డిగ్రీ ఫెయిల్ అయిన వారికి వీరి సంస్థ ద్వారా ఆన్లైన్ క్లాసులు చెప్పించి పాస్ అయ్యే విధంగా బాధ్యత తీసుకుంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 30 వ డివిజన్ క్లస్టర్ ఇంచార్జ్ ఘంటా కృష్ణమోహన్, బుజ్జి ఎలక్ట్రికల్స్ అధినేత కే వెంకట్రావు బంధువులు స్నేహితులు కుటుంబ సభ్యులు ఆహ్వానితులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News