Breaking News

ఏషియన్ ఓపెన్ ఐస్ స్కేటింగ్ ఛాంపియన్షిప్‌కు ఎంపికైన కైవల్యకు కమిషనర్ ధ్యానచంద్ర అభినందనలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇండోనేషియాలో వచ్చే నెల 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు జరగనున్న ఏషియన్ ఓపెన్ ఐస్ స్కేటింగ్ ఛాంపియన్షిప్–2026కు అర్హత సాధించిన విజయవాడకు చెందిన యువ క్రీడాకారుడు కొప్పరపు కైవల్యను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం వీఎంసీ ప్రధాన కార్యాలయంలో అభినందించారు.

ఈ సందర్భంగా కైవల్య ఇటీవల సాధించిన విజయాలను కమిషనర్‌కు వివరించారు. జూన్ 25 నుండి 30వ తేదీ వరకు డెహ్రాడూన్‌లో నిర్వహించిన 21వ జాతీయ ఐస్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో ఫిగర్ స్కేటింగ్ లెవెల్–8 బాలుర విభాగంలో స్వర్ణ పతకం సాధించి జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడంతో పాటు, ఆ ప్రతిభ ఆధారంగా ఏషియన్ ఓపెన్ ఐస్ స్కేటింగ్ ఛాంపియన్షిప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కిందని తెలిపారు.

ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ, అంతర్జాతీయ వేదికపై విజయవాడ నగరానికి, ఆంధ్రప్రదేశ్‌కు, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కైవల్య భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మరిన్ని పతకాలు సాధించాలని ఆశిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. యువ క్రీడాకారులు పట్టుదల, కృషి, క్రమశిక్షణతో ముందుకు సాగితే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని కమిషనర్ పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *