విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థలో ఎస్‌ఈ (ప్రాజెక్ట్స్)గా విధులు నిర్వహించి, చీఫ్ ఇంజినీర్‌గా పదోన్నతి పొందిన పి. సత్యకుమారి శనివారం నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రను ప్రధాన కార్యాలయంలో గల కమిషనర్ చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ చీఫ్ ఇంజినీర్‌గా పదోన్నతి పొందిన సందర్భంగా అభినందనలు తెలిపారు. నూతన బాధ్యతల్లోనూ అదే నిబద్ధత, సమర్థతతో పనిచేసి నగరాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో విశిష్ట సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పి. సత్యకుమారి కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, నగరాభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టుల అమలులో మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తానని తెలిపారు.
Prajavartha Online Telugu News