-ఎం ఎల్ ఏ సుజన చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు దివంగత ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అందించిన సేవలు చిరస్మరణీయమని మాజీ కేంద్ర మంత్రి వర్యులు విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి ( సుజనా చౌదరి) కొనియాడారు.. శనివారం ఆయన జయంతి సందర్భంగా వాసవి ఫౌండేషన్ , విజయవాడ ఆధ్వర్యంలో భవానిపురం లో కొణిజేటి రోశయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు..
ఈ కార్యక్రమానికి విజయవాడ పశ్చిమ ఎం ఎల్ ఏ సుజన చౌదరి, అవనిగడ్డ ఎం ఎల్ ఏ మండలి బుద్ధ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై రోశయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజన చౌదరి మాట్లాడుతూ రోశయ్య ఎంతో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ అనేక జాగ్రత్తలు తీసుకునే వారన్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోశయ్యకు దక్కిందన్నారు. ఆయన మరి కొంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేసి ఉంటే బాగుండేదని ఆశాభావం వ్యక్తం చేశారు. నేటి రాజకీయ నాయకులు ఆయన ప్రసంగాలను ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని ఈ సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని ఎమ్మెల్యే సుజనా గుర్తు చేసుకున్నారు..
రోశయ్యను ఆదర్శంగా తీసుకోవాలి
ఎం ఎల్ ఏ మండలి బుద్ధ ప్రసాద్..
అవనిగడ్డ ఎం ఎల్ ఏ మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ కొణిజేటి రోశయ్య ఎంతో పరిణితి చెందిన వ్యక్తి అన్నారు. పార్టీల మధ్య సిద్ధాంతపరంగా బేధాభిప్రాయాలు ఉన్న వ్యక్తిగత దూషణలకు తావు లేకుండా హుందాగా వ్యవహరించే వారిని తెలిపారు. ఆయన హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే కాకుండా 15 సంవత్సరాలు ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోకుండా పరిపాలన నడిపించారన్నారు.. యూపీఏ ప్రభుత్వం తమిళనాడు గవర్నర్ గా నియమించిందని చాకచక్యంగా, బాధ్యతతో పదవిని నిర్వర్తించారన్నారు. ఈతరం రాజకీయ నాయకులందరూ రోశయ్యను ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా మండలి బుద్ధ ప్రసాద్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీ నూర్ భాషా దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్,ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం ఎస్ బేగ్, జనసేన పార్టీ సీనియర్ నాయకుడు పెనుగొండ సుబ్బారాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు కోగంటి రామారావు,
వాసవి ఫౌండేషన్ చైర్మన్ వీ వీ కే నరసింహారావు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ , మాజీ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర, గడ్డం రవికుమార్, కొనిజేటి రమేష్, కొప్పురావూరి రజిని తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News