విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
48 మంది లబ్ధిదారులకు రూ 34 లక్షల 7 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే సుజన చౌదరి కూటమి నేతలతో కలిసి పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఆపదలో ఉన్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందిస్తున్న ఆర్థిక సాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. శనివారం భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ నూర్ భాషా దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం ఎస్ బేగ్, జనసేన సీనియర్ నాయకులు పెనుగొండ సుబ్బారాయుడు, మాజీ కూటమి కార్పొరేటర్లు, కూటమినేతలతో కలిసి మొత్తం రూ 34, 07,396 విలువైన ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను పంపిణీ చేశారు.
గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వ పాలనలో పశ్చిమ నియోజవర్గంలో మొత్తం – మంది లబ్ధిదారులకు రూ – కోట్లకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అమలు చేసి పేద కుటుంబాలను ఆదుకున్నామని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు.
గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వ పాలనలో పశ్చిమ నియోజవర్గంలో మొత్తం 866 మంది లబ్ధిదారులకు రూ. 10.61 కోట్లకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అమలు చేసి పేద కుటుంబాలను ఆదుకున్నామని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు.. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News