Breaking News

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సుజన చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గ పరిధిలో రూ 7 కోట్లతో చేపడుతున్న స్ట్రామ్ వాటర్ డ్రైనేజీలు, మరియు రూ 1 కోటి 20 లక్షలతో ప్రారంభించిన బాక్స్ కల్వర్టుల నూతన నిర్మాణాలను ఎమ్మెల్యే సుజన చౌదరి కూటమి నేతలతో కలిసి పరిశీలించారు. ఐరన్ యార్డ్, బైపాస్ రోడ్డు, చర్చ్ సెంటర్ లో జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల పురోగతిని వీ ఎం సీ ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గ వ్యాప్తంగా ఇన్సెంటివ్ ఫండ్స్ రూ 7 కోట్లతో ఐరన్ యార్డ్ , బైపాస్ రోడ్డు, పార్థసారధి రోడ్డు, పంజా సెంటర్ లో స్ట్రామ్ వాటర్ డ్రైనేజీల నిర్మాణ పనులు , విఎంసి జనరల్ ఫండ్స్ రూ 1 కోటి 20 లక్షలతో బాక్స్ కల్వర్టులను ప్రారంభించామని తెలిపారు. నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలను పాటించి నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని ఈ ఈ శ్రీనివాస్ కు తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *