విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ విద్యావేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ 125 వ జయంతి సందర్భంగా బూత్ కమిటీ సభ్యులు స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.. సోమవారం , హెచ్ బీ కాలనీ 10 వ నెంబర్ బూత్ పరిధిలో స్థానిక నాయకులందరూ శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.. జయంతి వేడుకల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతను ఇచ్చి బూత్ పరిధిలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు కందుల సుబ్రహ్మణ్యం యాదవ్, పగడాల కృష్ణ, జయ బాలన్, అల్లంకీ శ్రీను, మనోజ్, ఖాసీం దొడ్ల రాజా పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News