విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నీట్ ఆస్పరెంట్స్ అండ్ మెడికో పేరెంట్స్ అసోసియేషన్ ధర్నా విజయవాడ ధర్నా చౌక్ లో రెండవ రోజు కొనసాగింది. ఇందులో భాగంగా ఏపీ ఫీజు రెగ్యులారిటీ అథారిటీ కమిషన్ సెక్రటరీకు మరియు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్ లో రిజిస్టర్ డా.టి. సాయిసుధీర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విష్ణువర్ధన్ కు వినతి పత్రాలను అందించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని మెడికల్ కాలేజీలలో ఎంబిబిఎస్ సీట్లు పెంచాలని కొత్త మెడికల్ కళాశాలలను వెంటనే ప్రారంభించాలని ప్రైవేట్ వైద్య కళాశాలలో అడ్డు అదుపులేని ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఎంబిబిఎస్ సీట్లు చాలా తక్కువగా ఉన్నాయని కానీ కాంపిటీషన్ మాత్రం విపరీతంగా పెరిగిపోయిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన తెలియజేశారు. నీట్ ఎగ్జామ్ లో విపరీతమైన పోటీ ఫలితంగా తమ పిల్లలు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నట్లు వారు పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలో ఎంబిబిఎస్ సీట్లు తగినన్ని పెంచాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రైవేటు వైద్య కళాశాలలో నిబంధనలకు వ్యతిరేకంగా వసూలు చేస్తున్న అధిక ఫీజులను నియంత్రిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లను వ్యక్తపరుస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు పి. అరుణ్ చౌదరి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్, కార్యదర్శి రంగారావు మరియు వైస్ ప్రెసిడెంట్ పట్నాయక్, అల్తాఫ్ హుస్సేన్, నాగేంద్ర మరియు ఉప కార్యదర్శి అనూష, కోశాధికారి రాధిక, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రసాద్, రెహమాన్, మాధవి మొదలగు సభ్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News