-నిరాహార దీక్షని ప్రారంభించిన వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రవిచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మెగా డీఎస్సీ 2025 అక్రమ నియామకాలపై తమకు అన్యాయం జరిగిందంటూ దివ్యాంగుడు అంజనప్ప మరియు డీఎస్సీ అభ్యర్థిని పీ. ప్రభావతి సోమవారం విజయవాడ ధర్నా చౌక్ లో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా అంచనప్ప మరియు ప్రభావతి మాట్లాడుతూ విద్యాశాఖలో అధికారులు అక్రమాలకు పాల్పడి అర్హత లేని వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చారని విమర్శించారు. విద్యాశాఖ మంత్రి, డీఈఓ, కన్వీనర్, కమిషనర్ కలిసి ఎంతోమంది నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేశారు అని అన్నారు. అర్హత లేని కురువ శ్రీనివాసులు అనే వ్యక్తిని సెలక్షన్ లిస్ట్ లో ఎలా చేర్చాలో చెప్పాలి అని నిలదీశారు. కలెక్టర్ ఆదేశించినా మెడికల్ ఎంఐఎ లేని వ్యక్తికి ఉద్యోగం ఎలా ఇచ్చారు.? తనకున్న 40% వైకల్య సర్టిఫికేట్ను అధికారులు ఎందుకు కన్సిడర్ చేయడం లేదు అని ప్రశ్నించారు. ఐఏఎస్ అధికారి కోన సిస్టర్ కూడా కింది స్థాయి అధికారులకు, కోర్టులకు తప్పుడు సమాచారం ఇస్తూ పక్కదారి పట్టిస్తున్నారు అని వ్యాఖ్యానించారు.
విహెచ్ కోటాలో 40 శాతం అర్హత ఉన్నప్పటికీ అధికారులు వివరాలు అప్లోడ్ చేయలేదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల హారిజాంటల్ రిజర్వేషన్ కింద బిసి ఎ ఉమెన్ కోటాలో ఉద్యోగం కోల్పోయాను అని ప్రభావతి వాపోయారు. తమకు అన్యాయం జరిగింది అనడానికి తమ దగ్గర అన్ని సాక్షాలు ఉన్నాయని ఆ సాక్షాలతో అధికారుల చుట్టూ మంత్రుల చుట్టూ కమిటీల చుట్టూ ఎన్నిసార్లు తిరిగిన తమకు ఎలాంటి ప్రయోజనం లేదని తమకు న్యాయం జరిగేంతవరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తామని అన్నారు అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని అన్నారు. అనంతరం వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పేరు రవిచంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం డీఎస్సీ పోస్టులను లక్షలకు అమ్ముకుందని ధ్వజమెత్తారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు కోర్టులో పోరాడుతామని అదే విధంగా డీఎస్సీ అక్రమాలపై సిబిఐ ఎంక్వయిరీ లేదా సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాలు పరదర్శకంగా జరిగినట్లయితే ప్రభుత్వం తమ అధికారులను బాధితుల వద్దకు పంపి నిజాన్ని నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేయకుంటే మంత్రి నారా లోకేష్ అక్రమాలకు బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంతపురం వైసిపి వికలాంగుల విభాగం ప్రధాన కార్యదర్శి రాజేష్, నిరుద్యోగ వికలాంగులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News