Breaking News

ఘనంగా జరిగిన డాక్టర్స్ డే

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ వారు నగరంలో ప్రముఖ వైద్యులను సన్మానించడం స్థానిక నాస్థిక కేంద్రంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ అధ్యక్ష్యులు జి.శ్యామల మాట్లాడుతూ సేవే లక్ష్యం సేవలందిస్తున్న కొంత మంది వైధ్యులను సన్మానించుకోవలసిన అవసరం ఉందని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఇక్కడకు వచ్చిన ప్రతి వైద్యులకు, రాలేక పోయిన వారికి సుభాకాంక్షలను తెలియ జేస్తున్నామని ఆమె అన్నారు. సమాజానికి మరెన్నో సేవలను రాబోయే కాలంలో అందిచాలని సంస్థ మనసారా కోరుకుంటున్నదని ఆమె అన్నారు.

అనంతరం ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ వారు 17 మంది వైద్యులను సన్మానించడం జరిగింది. వారిలో డా. జి.సమరం, డా. మెహర్ నారయన ప్రసాద్, డా.పి దీక్ష, డా.యన్.మౌనిక, డా.పి. మెరోజ్, డా. అభినయ జోశ్న, డా. మధు రాణి, డా. హర్ష డా. ప్రశాంతి, డా.ఓలాస్ గోరా, డా. సుదీప్తి వర్ధన్, డా. ఆర్. స్వర్ణలత, డా. రంజిత్, డా.సోమలత, డా. నీలిమ, డా. దేవి మానస, డా. నవీన్ ఉన్నారు.

ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ పాలకవర్గ సభ్యులు సరోజ, రశ్మిసమరం, సకల, జానకి, గంగ జానకి, రాధిక పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *