Breaking News

డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు ఆశీస్సులతో డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్లో పైపుల్ రోడ్ సెంటర్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర 500 మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు ప్రారంభించి వడ్డెన చేశారు. తెల్లవారుజామున 5:00కి వంట ప్రారంభించి స్వయంగా వండి ఆకలితో ఉన్నవారికి వడ్డించడమే డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం నెలలో మూడు నాలుగు సార్లు జరిగే ఈ అన్నదాన కార్యక్రమం ఆకలితో ఎక్కడ ఉన్నా వారి దగ్గరికి వెళ్లి పెట్టడమే ఈ ట్రస్టు సభ్యులకి సంతోషాన్ని కలగజేస్తుంది. ఎంతో కష్టపడి చేసి ఇంతమంది ఆకలితో ఉన్నవారికి కడుపునిండా పెట్టడానికి విరాలిచ్చే వారికి, సహాయ చేసే వారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసిన డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకరాలు అవుటపల్లి విజయ కుమారి ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షురాలు సంసాని విజయలక్ష్మి, ఉపాధ్యక్షురాలు గుబ్బల జ్యోతిశ్వరి, కార్యనిర్వాహణ అధికారి పల్లా ఉమామహేశ్వరి, కమిటీ సభ్యులు దాసరి ప్రశాంతి, నారాయణ, రాచూరి రాణి, పుణ్య లక్ష్మీ దుర్గ, జార్జ్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *