-విజయవాడ రైల్వే స్టేషన్లో ఎంపీ కేశినేని చిన్ని ఆకస్మిక తనిఖీ
-ప్రయాణికులు కార్మికులతో నేరుగా మాట్లాడిన ఎంపీ చిన్ని
-స్టేషన్లో పరిస్థితులు సమస్యలు వివరించేందుకు ఎంపీ దగ్గరకు వచ్చిన కార్మికులు,ప్రయాణికులు
-ప్రయాణికులు ఇచ్చిన సమాచారం మేరకు రైల్వే స్టేషన్ అధికారులతో మాట్లాడిన చిన్ని
-ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు తెలిపిన చిన్ని
-బి ఆర్ కే సంస్థ ఆధ్వర్యంలో పాసింజర్ రెస్ట్ రూమ్స్ ను ప్రారంభించిన ఎంపీ చిన్ని
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో ఎల్లప్పుడూ రద్దీగా ఉంటుంది అలాంటి రద్దీగా ఉండే ప్రాంతంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని) ఆకస్మిక తనిఖీ చేశారు. ప్లాట్ ఫామ్స్ అన్ని పరిశీలిస్తూ ప్రయాణం చేసే ప్రయాణికులతో ఎంపీ నేరుగా మాట్లాడారు రైల్వే స్టేషన్లో ఉన్న వసతులు సౌకర్యాలు మరియు పరిస్థితులపై నేరుగా మాట్లాడి తెలుసుకున్నారు. ఎంపీ చిన్ని స్టేషన్ కు ఆకస్మికంగా తనిఖీకి రావడంతో ఒక్కసారిగా ప్రయాణికులు ఉన్న పరిస్థితులు వివరించేందుకు ఎంపీ చిన్ని దగ్గరికి వచ్చి విషయాలని సమగ్రంగా ఎంపీ దృష్టికి తెలిపారు ప్రయాణికులు తెలిపిన సమాచారం మేరకు రైల్వే స్టేషన్లో ఉన్న ఉన్నతాధికారుల దృష్టికి ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులన్నింటినీ ఎంపీ కేశినేని చిన్ని తీసుకువెళ్లారు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యం కలగకుండా చూడాలని సిబ్బందికి తెలియజేశారు అదేవిధంగా వి ఆర్ కే సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పాసింజర్ రెస్ట్ రూమ్స్ ను సైతం ఎంపీ కేశినేని చిన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ దేశంలోనే అతి పెద్ద రైల్వే స్టేషన్ విజయవాడ రైల్వే స్టేషన్ అని అమృత్ భారత్ కింద విజయవాడ రైల్వే స్టేషన్ ను ఏర్పాటు చేయాలని ఇప్పటికే పార్లమెంట్ దృష్టిలో మూడు నాలుగు సార్లు విజ్ఞప్తి చేసినట్లు ఎంపీ తెలిపారు రైల్వే మంత్రిత్వ శాఖ అదేవిధంగా అందరూ చెప్పింది విజయవాడ రైల్వే స్టేషన్ బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ మాత్రమే కాదు బిజీయస్ట్ రైల్వే స్టేషన్ అనిఅన్నట్లు తెలిపారు. పి పి మోడల్ లో అభివృద్ధి చేయాలని ఇప్పటికే కేంద్రం పిలుపునిచ్చిన ఇంతవరకు ఏ కాంట్రాక్టర్ ముందుకు రాలేదని టెండర్ లో మార్పులు చేర్పులు చేయవలసిన అంశాలపై త్వరలో జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో అటు కేంద్రంలో రైల్వే మంత్రిత్వ శాఖ మంత్రి మరియు అధికారులతో పాటు రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రితో కచ్చితంగా సంప్రదింపులు జరిపి పరిష్కారం వచ్చే దిశగా కృషి చేస్తామని తెలిపారు అన్ని రైల్వే స్టేషన్లో కూడా అమృత్ భారత్ స్కీం కింద అభివృద్ధి చెందాలనేది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ యొక్క లక్ష్యమని ఎంపీ చిన్ని స్పష్టం చేశారు విజయవాడ రైల్వే స్టేషన్లో రోజుకు 1100 మంది రైల్వే కార్మికులు విధులు నిర్వహిస్తున్న తరుణంలో సౌకర్యాలు ఇంకా మెరుగైనవి రావాల్సిన అవసరం ఉందని దానికోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని తెలియజేశారు
బి ఆర్ కె సంస్థ ఆధ్వర్యంలో పాసింజర్ రెస్ట్ రూమ్స్ ను ఏర్పాటు చేయడం సంతోషదాయకమని ఎంపీ అన్నారు నార్త్ కి సౌత్ కి మధ్య పెద్ద జంక్షన్ విజయవాడ కాబట్టి విజయవాడ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల రద్దీ అదే విధంగా జంక్షన్ కారణంగా ఎక్కువ మంది ప్రజానీకం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి విజయవాడ రైల్వే స్టేషన్ లో ఎక్కువ డార్మెటరీస్ కావాలి అని తెలిపారు బి ఆర్ కే వారి ఏర్పాటుచేసిన డార్మెటరీస్ లో అన్ని ఏసీ రూములు మంచి టాయిలెట్స్ సౌకర్యాలతో డార్మెటరీ చాలా అద్భుతంగా ఉందని తెలిపారు రైల్వే వారిని అన్ని సౌకర్యాలతో విజయవాడ రైల్వే స్టేషన్ ను తీర్చిదిద్దాలని ఎంపీ తెలిపారు త్వరలో డిమాండ్ లో ఉన్న మచిలీపట్నం గోవా ట్రైన్ ని సైతం తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు ఎంపీ తెలిపారు అమ్మవారి పేరుతో ఒక ట్రైన్ ఏర్పాటు చేయాలని గతంలో రైల్వే మంత్రి దృష్టికి తీసుకువెళ్లామని తప్పకుండా అది కూడా పూర్తి చేస్తామని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో ఎంపీ చిన్ని, నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, ప్రముఖ వ్యాపారవేత్త కే దస్తగిరి, బి ఆర్ కే సంస్థ ప్రతినిధులు మరియు రైల్వే అధికారులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News