-పాల్గొన్న సమగ్ర శిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు, IAS
-ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్కరణలకు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల కితాబు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ బ్యాంక్ (World Bank) ఆర్థిక సహాయంతో భారతదేశంలో కొనసాగుతున్న వివిధ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల నిర్వహణ సామర్థ్యాన్ని, క్షేత్రస్థాయి అమలును మరింత బలోపేతం చేయడం కోసం ఉద్దేశించిన మూడు రోజుల “స్ట్రెంథెనింగ్ క్లైంట్ కెపాసిటీ ఫర్ ఇంపాక్ట్” (SCCI) ప్రత్యేక శిక్షణా సదస్సు మంగళవారం న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ ‘హోటల్ లీ మెరిడియన్’లో ఘనంగా ప్రారంభమైంది. జూలై 7 నుండి 9వ తేదీ వరకు జరిగే ఈ ఉన్నత స్థాయి సదస్సులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు, IAS, సాల్ట్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ డా. వి.సతీష్ రెడ్డి పాల్గొన్నారు.
ఏపీ విద్యా సంస్కరణలకు ప్రపంచ బ్యాంక్ ప్రశంసలు
సదస్సులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రపంచ బ్యాంక్ భాగస్వామ్యంతో అమలువుతున్న వివిధ ప్రాజెక్టుల పురోగతిని ఎస్పీడీ బి. శ్రీనివాసరావు, IAS వివరించారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపుదల, మౌలిక వసతుల కల్పన, డిజిటల్ లెర్నింగ్, ఉపాధ్యాయుల సామర్థ్య పెంపొందించే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక సంస్కరణలను, సాధించిన అద్భుత ఫలితాలను ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల కోసం అమలు చేస్తున్న ‘సాల్ట్’ (SALT – Supporting Andhra’s Learning Transformation) కార్యక్రమంపై అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వ్యక్తమయ్యాయి. ‘ప్రొగ్రామ్ ఫర్ రిజల్ట్’ (Program for Results – PforR) ఫ్రేమ్ వర్క్ ఆధారంగా ఒక ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో ఎంత అద్భుతంగా, విజయవంతంగా అమలు చేయవచ్చో నిరూపించడానికి ఏపీ ‘సాల్ట్’ కార్యక్రమమే ఒక అత్యుత్తమ ఉదాహరణ అని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు కొనియాడారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ విద్యా నమూనా అత్యంత ఆదర్శవంతంగా ముందుకు సాగుతోందని వారు కితాబు ఇచ్చారు.
సదస్సులో అంశాలు
– సదస్సులో తొలిరోజు ప్రపంచ బ్యాంక్ గ్రూప్ (WBG) పనితీరు, ‘ఇండియా కంట్రీ పార్టనర్షిప్ ఫ్రేమ్‌వర్క్’పై నిపుణులు అవగాహన కల్పించారు. అధికారులు, భాగస్వామ్య ఏజెన్సీల అభ్యసన స్థాయిని అంచనా వేసేందుకు క్యూఆర్ (QR) కోడ్ ద్వారా ‘నాలెడ్జ్ ప్రీ-టెస్ట్’ నిర్వహించారు. ప్రాజెక్ట్ సైకిల్, భారతదేశంలో ప్రాజెక్టుల అమలులో ఎదురవుతున్న సవాళ్లు, కమ్యూనికేషన్ & స్టేక్‌హోల్డర్ ఎంగేజ్మెంట్, ఆర్థిక నిర్వహణ (Financial Management) వంటి కీలక అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయి.
– రెండో రోజు ప్రొక్యూర్మెంట్ విధానాలపై, పర్యావరణ-సామాజిక నిబంధనల ఫ్రేమ్‌వర్క్ (ESF) పై ప్రత్యేక సెషన్స్ జరగనున్నాయి.
– మూడో రోజు ప్రాజెక్టుల పర్యవేక్షణ – మూల్యాంకనం, ‘ఫైనాన్స్ ప్లస్’ ఆపరేషన్స్, సరికొత్త ‘డి-రెడీ’ విధానంపై అవగాహన కల్పిస్తారు. అనంతరం ‘ఇంటిగ్రేటెడ్ కేస్ స్టడీ – గ్రూప్ వర్క్’, నాలెడ్జ్ పోస్ట్-టెస్ట్ వంటి అంశాలపై శిక్షణ ఉంటుంది.
ఈ సదస్సు కేవలం థియరీ క్లాసులకే పరిమితం కాకుండా ప్రాక్టికల్ అవగాహన కల్పించేలా రూపొందించారని, ఇక్కడ చర్చించిన అంతర్జాతీయ ఉత్తమ విధానాలను ఆంధ్రప్రదేశ్‌లో ప్రాజెక్టులను మరింత వేగంగా, పారదర్శకంగా అమలు చేయడానికి ఉపయోగిస్తామని ఎస్పీడీ బి. శ్రీనివాసరావు, IAS పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News