Breaking News

అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం, జలియాన్‌వాలా బాగ్‌ను సందర్శించిన కృష్ణా డీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సహకార బ్యాంకింగ్ రంగంలో సంస్థాగత అభ్యాసం, విజ్ఞాన మార్పిడి, ఆధునిక బ్యాంకింగ్ విధానాల అవగాహన, ఉత్తమ విధానాల అమలు లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు (APCOB) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అధ్యయన పర్యటనలో భాగంగా, మాజీ మంత్రి, కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (KDCC Bank) చైర్మన్ నెట్టెం రఘురామ్, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు  నేతృత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 12 జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల (DCCB) చైర్మన్ల ప్రతినిధి బృందంతో కలిసి పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లోని ప్రపంచ ప్రసిద్ధ *స్వర్ణ దేవాలయం (హర్మందిర్ సాహిబ్)*ను దర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ ప్రజల సంక్షేమం, రైతాంగ శ్రేయస్సు, సహకార రంగ బలోపేతం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో చిరస్మరణీయ స్థానం సంపాదించిన జలియాన్‌వాలా బాగ్ స్మారక స్థలాన్ని సందర్శించి అమరవీరులకు ఘన నివాళులర్పించారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగస్ఫూర్తి ప్రతి భారతీయుడికి స్ఫూర్తిగా నిలుస్తుందని నెట్టెం రఘురామ్ పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *