గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియకు జూలై 14 వరకే గడువు ఉందని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె.మయూర్ అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాలు అందుకున్న ఓటర్లు వాటిని నింపి, వెంటనే బిఎల్ఓలకు ఇచ్చి సహకరించాలని కోరారు. మంగళవారం నాటికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మొత్తం 2,52,062 ఓటర్లకు గాను 2,50,765 ఫారాలను (99.49 శాతం) పంపిణీ చేసి, అందులో 1,34,512 ఫారాలను డిజిటలైజ్ చేశామని వివరించారు. అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం 2,78,555 ఓటర్లకు గాను 2,76,603 ఫారాలను (99.30 శాతం) పంపిణీ పూర్తి చేసి, వాటిలో 1,36,696 ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు కమిషనర్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News