గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో కురిసే వర్షాల వలన ప్రధాన రహదారుల్లో వర్షపు నీరు నిలువకుండా ఎప్పటికప్పుడు కాలువలలోకి వెళ్ళేలా స్ట్రోం వాటర్ డ్రెయిన్ (వర్షపు నీరు) పారుదల వ్యవస్తను పటిష్టం చేస్తున్నామని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ అన్నారు. మంగళవారం కమిషనర్ ఛాంబర్ నందు యస్.ఈ.జి.హెచ్ అసోసియేట్ బృంద ప్రతినిధులు నగరంలోని ప్రధాన అవుట్ ఫాల్ డ్రెయిన్ ప్రాంతాలైన బ్రాడీపేట, కొబాల్ద్ పేటల్లోని పీకల వాగు, ఇన్నర్ రింగ్ రోడ్డు రిలయన్స్ వద్ద గల అంబేద్కర్ వాగు, బుడంపాడు, సంగడిగుంట ప్రాంతాలలోని ప్రధాన అవుట్ ఫాల్ డ్రెయిన్స్ లో వర్షపు నీరు నిలబడకుండా తీసుకోవలసిన చర్యలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.
సమావేశం నందు తొలుత నగరంలో ప్రధాన అవుట్ ఫాల్ డ్రెయిన్ ప్రాంతాలైన బ్రాడీపేట, కొబాల్ద్ పేట పీకల వాగు, ఇన్నర్ రింగ్ రోడ్డు రిలయన్స్ వద్ద గల అంబేద్కర్ వాగు, బుడంపాడు, సంగడిగుంట ప్రాంతాలలో గల అవుట్ ఫాల్ డ్రెయిన్స్ పై యస్.ఈ.జి.హెచ్ అసోసియేట్ బృంద ప్రర్తినిధులు తయారు చేసిన పవర్ పాయింట్ ప్రేజేటేషణ్ ను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలో కొన్ని ప్రాంతాలలో చిన్నపాటి వర్షానికే వర్షపు నీరు రహదారుల్లో నిలబడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సదరు సమస్యను అధిగామించదానికి వర్షాలు పడినప్పుడు నగరంలోని రహదారుల్లో వర్షపు నీరు నిలువకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలో యస్.ఈ.జి.హెచ్ అసోసియేట్ బృంద ప్రర్తినిధులు అధ్యయనం చేసి, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తయారు చేశారని, సదరు పవర్ పాయింట్ ప్రేజేటేషణ్ మేరకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించామన్నారు. నగరంలో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురికాకుండా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.
సదరు సమావేశంలో జియంసి ఇంచార్జ్ యస్.ఈ సుందరరామిరెడ్డి, యస్.ఈ.జి.హెచ్ అసోసియేట్ బృంద ప్రతినిధి శరత్, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News