బ్యాంకు ఖాతాను ఎన్‌పీసీఐతో అనుసంధానించాలి

– జిల్లా ఎస్‌సీ సంక్షేమం, సాధికార‌త అధికారి పి.జ్యోతిలక్ష్మీదేవి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2026-27 విద్యాసంవత్సరానికి తల్లికి వందనం పథకం ద్వారా లబ్ది పొందేందుకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎస్‌సీ విద్యార్థులు త‌ప్ప‌నిస‌రిగా త‌మ బ్యాంకు ఖాతాను ఎన్‌పీసీఐ పోర్ట‌ల్‌తో అనుసంధానం (లింక్‌) చేసుకోవాల‌ని జిల్లా ఎస్‌సీ సంక్షేమం, సాధికార‌త అధికారి పి.జ్యోతిల‌క్ష్మీదేవి బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో సూచించారు. అదేవిధంగా ఇప్పటివరకు బ్యాంకు ఖాతాను ఓపెన్ చేయని విద్యార్థుల కోసం పోస్టల్ డిపార్ట్మెంట్.. స‌మీప గ్రామంలోని పోస్టాఫీసులో ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాను రూ. 200తో ప్రారంభించుటకు విద్యార్థుల‌కు అవకాశం క‌ల్పించిన‌ట్లు తెలిపారు. ఇందుకు విద్యార్థులు ఆధార్ కార్డు, ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నెంబర్, జనన ధ్రువీకరణ పత్రం, ప‌దో త‌ర‌గతి మార్కుల జాబితా ప‌త్రాలు తీసుకొని వెళ్లాల‌న్నారు. పోస్టల్ బ్యాంకు ఖాతాను ప్రారంభించిన వెంటనే బ్యాంకు ఖాతాను ఎన్‌పీసీఐ పోర్ట‌ల్‌తో అనుసంధానం చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. విద్యార్థులు బ్యాంకు ఖాతాను ప్రారంభించ‌డం, ఎన్‌పీసీఐ పోర్ట‌ల్‌తో అనుసంధానం ప్ర‌క్రియ‌ను ఈ నెల 11వ తేదీలోగా పూర్తిచేసుకోవాల‌న్నారు. జిల్లాలోని ఇంట‌ర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ ఈ సమాచారాన్ని మొదటి సంవత్సరం చ‌దువుతున్న ఎస్‌సీ విద్యార్థుల‌కు తెలియ‌జేయాల‌ని జ్యోతిల‌క్ష్మీదేవి కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *