డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా ఘన నివాళులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్షేమ పథకాల ప్రధాత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, మాజీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ పాల్గొని డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఆయన ప్రజాసంక్షేమ పాలనను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కార్యదర్శిలు తంగిరాల రామిరెడ్డి, అల్లాచెల్లారావు, మాజీ కార్పొరేటర్లు భీమిశెట్టి ప్రవల్లిక, కలపాల అంబేద్కర్, వియ్యపు అమర్నాధ్, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, రాష్ట్ర మరియు జిల్లా కమిటీ నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని వైఎస్సార్ సేవలను కొనియాడుతూ ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని పేర్కొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *