మెరుగైన వైద్యం కోసం రూ 14 లక్షల విలువైన ఎల్ఓసిలు అందజేత…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎం ఎల్ ఏ సుజన చౌదరి సౌజన్యంతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఎల్ ఓ సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) లను ఎం ఎల్ ఏ కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి అందజేశారు.

39 వ డివిజన్, కామకోటి నగర్ కు చెందిన పులిపాటి మోహన్ రావు (62 ) గాల్ స్టోన్ సమస్యతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి మెరుగైన వైద్యం అందించాలని శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు తెలపడంతో ఎన్డీయే కార్యాలయంలో వైద్యం సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 4 లక్షల 42 వేల ఎల్ ఓ సీ ను బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.

46 వ డివిజన్, చిట్టి నగర్ కు చెందిన లేళ్ల ప్రకాష్ రెడ్డి ( 61) హెర్నియా తో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 3లక్షల 45 వేల ఎల్ ఓ సీ ను అందజేశారు. అదే విధంగా 49 వ డివిజన్, ప్రైజర్ పేట కు చెందిన వర్రి సూర్య కుమారి హృద్రోగం తో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 6 లక్షల 50 వేల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ లను అందజేయడంతో బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుజనా కు కృతజ్ఞతలు తెలిపారు.

టీడీపీ రాష్ట్ర నాయకులు గుర్రంకొండ, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ నున్న కృష్ణ, దుర్గమ్మ గుడి ట్రస్ట్ బోర్డు మెంబర్ అవ్వారు శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ పచ్చిపులుసు వెంకట శివప్రసాద్, కూటమి నేతలు ఏలూరి సాయి శరత్, షేక్ కరిముల్లా, దనాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *