ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు మరింత విస్తృత ప్రచారం

-డిజిటల్ కమ్యూనికేషన్ బలోపేతంపై మంత్రి కొలుసు పార్థసారథి దిశానిర్దేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా, ప్రభావవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేయాలని రాష్ట్ర సమాచార, గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ (APDC) అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతి పరిధిలోని తాడేపల్లిలో గల ఏపీ డిజిటల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి బుధవారం సందర్శించి సంస్థ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా గత రెండేళ్లలో ప్రభుత్వ సోషల్ మీడియా వేదికల ద్వారా సుమారు మిలియన్ల వ్యూయర్ టచ్‌పాయింట్లు నమోదైనట్లు సమావేశంలో వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి చేరేలా డిజిటల్ ప్రచారాన్ని విస్తరించాలని మంత్రి సూచించారు.

సమావేశంలో ప్రధానంగా చర్చించిన అంశాలు

* ప్రభుత్వంలోని అన్ని శాఖలు తమ కార్యక్రమాలకు సంబంధించిన ధృవీకరించబడిన సమాచారాన్ని సకాలంలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్‌తో పంచుకోవాలని మంత్రి సూచించారు. దీనివల్ల ప్రభుత్వ సమాచారాన్ని వేగంగా ప్రజలకు చేరవేయడం సాధ్యమవుతుందని తెలిపారు.
* ప్రభుత్వ సందేశాల విస్తరణ కోసం డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్సర్లను ప్రభుత్వ కమ్యూనికేషన్‌లో భాగస్వాములను చేసే విధంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఏపీడీసీని ఆదేశించారు.
* ప్రజలకు విశ్వసనీయమైన సమాచారం అందించేందుకు పోలీసు శాఖ ధృవీకరించిన సమాచారాన్ని ఏపీడీసీతో సమన్వయం చేసుకునే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.
* ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల డిజిటల్ చేరువను పెంచేందుకు వ్యూహాత్మక సోషల్ మీడియా ప్రచారాలకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి తెలిపారు.
* ప్రభుత్వ సోషల్ మీడియా వేదికల కోసం నాణ్యమైన డిజిటల్ కంటెంట్ రూపొందించేందుకు ప్రత్యేక కంటెంట్ క్రియేటర్లను నియమించాల్సిన అవసరాన్ని మంత్రి ప్రస్తావించారు.
* ప్రజల్లో అధిక ఆదరణ పొందుతున్న రీల్స్ మరియు షార్ట్-ఫామ్ వీడియో కంటెంట్ ప్రభుత్వ డిజిటల్ కమ్యూనికేషన్‌లో కీలక భాగంగా ఉండేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
* ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాహిత నిర్ణయాలను X, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్ తదితర డిజిటల్ వేదికల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు.
* రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోషల్ మీడియా యూనిట్లను పూర్తిస్థాయిలో క్రియాశీలం చేసి, ప్రభుత్వ కార్యక్రమాలను గ్రామస్థాయి వరకు సమర్థవంతంగా ప్రజలకు చేరవేయాలని సూచించారు.

సమావేశంలో మంత్రి పార్థసారథి సంస్థ ఉద్యోగుల సమస్యలను కూడా అడిగి తెలుసుకుని, సంస్థ కార్యకలాపాల నిర్వహణకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. రాణి సుష్మిత, ఐ & పీఆర్ – స్పెషల్ ఆఫీసర్ గల్లా శేషుకుమార్, ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *