APSSDC మరియు BNI మెగా జాబ్ మేళా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) మరియు బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ (BNI) వారి సంయుక్త అధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.12.07.2026 అదివారం ఉదయం 08:00 గంటలకు మన విజయవాడ లోని పి.బి. సిద్దార్థ కాలేజీ అఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, Moghalrajapuram, విజయవాడ, నందు “మెగా జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు మరియు BNI ప్రతినిధులు జె.హెచ్.దేశాయ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, విజయవాడ & ఆచంట. మేఘాన – చైర్మన్, విజయవాడ తెలియజేసారు.

BNI సంస్థ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మెగా జాబ్ మేళా ను 100 కి పైగా కంపెనీలతో నిర్వహిస్తున్నట్లు మరియు ఈ కంపెనీస్ లో ఎక్కువగా మల్టీ నేషనల్ కంపెనీస్ (MNC) లు ఉన్నాయాని (Genpact, Teleperformance etc.,) BNI ప్రతినిది జె.హెచ్.దేశాయ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, విజయవాడ తెలియజేశారు.

ఈ కంపెనీలో గల ఉద్యోగాలకు 10వ తరగతి, ఇంటర్మీడియట్, ITI, పాలిటెక్నిక్, డిగ్రీ, బి.టెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు ఫార్మసీ పూర్తిచేసిన 18 నుండి 35 సంవత్సరాల లోపు యువతి మరియు యువకులు అర్హులని, ఎంపిక అయిన వారికి నెలకి Rs. 12,000/- నుంచి Rs. 50,000/- వరకు వేతనము మరియు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవని, జులై 12 న నిర్వహించబోయే ఈ మెగా జాబ్ మేళా కు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు BNI ప్రతినిది జె.హెచ్.దేశాయ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, విజయవాడ తెలియజేశారు.

ఆసక్తి మరియు తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in/user-registration లింక్ నందు తప్పనిసరిగా తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ కావడంతోపాటు, సదరు మెగా జాబ్ మేళా కు Resume తో లేదా Bio Data Forms తో పాటు ఆధార్, ఆధార్ కు లింక్ అయిన ఫోన్ నెంబర్, PAN కార్డ్ కాపీ మరియు సర్టిఫికెట్ల Xerox కాపీలతో రావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు కళ్యాణ్ – 83339 08080, నరేష్ – 90326 33548 మరియు కిషోర్ – 99857 59304 నంబర్లను ను సంప్రదించాలని BNI ప్రతినిది జె.హెచ్.దేశాయ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, విజయవాడ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *