రామ రాజ్య నగర్ నివాసితులకు ఎంపీ కేశినేని చిన్ని భరోసా

-గత వైసిపి హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు తీసుకుని ఇబ్బందుల్లో పడ్డామంటున్నా రామరాజ్య నగర్ వాసులు
-రైల్వే స్థలంలో స్థలాలు ఇచ్చి ఎటూ కాకుండా చేశారంటూ ఆవేదన
-కలెక్టర్ తో చర్చించి మార్చే అవకాశం ఉంటే కనుక సానుకూలమైన నిర్ణయం వచ్చే విధంగా చూస్తానని హామీ ఇచ్చిన ఎంపీ చిన్ని

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఎంపీ కార్యాలయానికి రామరాజ్యనగర్ కు చెందిన 400 కుటుంబాల నివాసితులు ఎంపీ కేశినేని చిన్ని తో భేటీ అయ్యారు గత వైసిపి హయాంలో రైల్వే స్థలంలో ఇళ్లపట్టాలి కేటాయించారని మరొక రెండు నెలల్లో రైల్వే అధికారులు ఆ స్థలాలలో నుండి ఇప్పుడు ఖాళీ చేయమంటున్నారని ఖాళీ చేయకపోతే పంపి వేస్తామని హెచ్చరిస్తున్నట్లు దిక్కుతోచని స్థితిలో ఎంపీ కార్యాలయానికి రావడం జరిగిందని తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎంపి కేశినేని చిన్ని మాట్లాడుతూ గత వైసిపి హయాంలో వైసీపీ చేసిన తప్పిదం వల్ల ఇప్పుడు 400 కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని అన్నారు రైల్వే స్థలమని తెలిసి అలాంటి చోట 400 కుటుంబాలకు వెళ్ళ పట్టాలు ఇచ్చి వారిని దిక్కుతోత్తని స్థితిలో వదిలేసారని ఇప్పుడు రైల్వే అధికారులు వారిని ఖాళీ చేయమంటే ఎక్కడకు ఆ కుటుంబాలు వెళ్తాయని అన్నారు ఈరోజు జిల్లా కలెక్టర్ తో జరిగే సమావేశంలో ఈ అంశాన్ని ప్రధానంగా లేవనెత్తి ఇచ్చిన స్థలాలు రద్దుచేసి వేరే చోట ఇచ్చే అవకాశం ఉంటే కనుక కచ్చితంగా జిల్లా కలెక్టర్ తో మాట్లాడి అందరి కుటుంబాలకు న్యాయంచేస్తానని తెలిపారు స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మరియు టిడిపి సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు తో కలసి ఈ విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టామని ఈరోజు జిల్లా కలెక్టర్ దృష్టిలో ఉంచి సాధ్యమైనంత మేరకు కుటుంబాలన్నిటికీ న్యాయం జరిగేలా చూస్తామని తెలియజేశారు ఒకవేళ కలెక్టర్ ఆమోదించి మారిస్తే మంచి చోట ఇళ్ల పట్టాలి ఇప్పించి అన్ని విధాల సహాయ సహకారాలు అందించే విధంగా కృషి చేస్తానని భరోసానిచ్చారు. నిర్మాణ దశలో ఉన్న స్థలాలు వదిలి వెళ్ళమంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది వైసిపి ఇలాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కు పాల్పడింది కాబట్టే ప్రజల ఆగ్రహానికి గురైందని ఎంపీ చిన్ని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, టిడిపి సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు, గొల్లపూడి గ్రామ టిడిపి పార్టీ అధ్యక్షులు నూతలపాటి నారద, ఏ ఎం సి చైర్మన్ నర్రా వాసు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *