విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బీసెంట్ రోడ్ మోడరన్ సూపర్ మార్కెట్ సమీపంలో నూతనంగా శుభప్రదం షో రూమ్ను ఏర్పాటు చేశారు. ప్రముఖ సినీ నటి అనసూయ భరద్వాజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి శుభప్రదం షోరూమ్ ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం షోరూంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల చీరలను పరిశీలించడంతోపాటు వాటి నాణ్యత ధరల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అమ్మవారి ఇల్లయిన విజయవాడలో శుభప్రదం వారు అందించిన ఎరుపు, ఆకుపచ్చ రంగుల చీర కట్టుకుని రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. లేడీస్ ఫస్ట్.. ఫ్యాషన్ లో బెస్ట్’ అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ షోరూంలోని కలెక్షన్స్ ధరలు తనను ఎంతగానో ఆశ్చర్యపరిచాయని, ఇక్కడి ధరలు చాలా అందుబాటులో ఉన్నాయని కొనియాడారు. మహిళలందరూ ఎక్కువగా ఇష్టపడేది చేరలేనని చీరకట్టు మహిళా సాంప్రదాయానికి ప్రతీక అని ఆమె తెలియజేశారు. తాను త్వరలో మూడు చిత్రాలలో నటిస్తున్నానని విభిన్న పాత్రలలో ప్రేక్షకులను కనువిందు చేస్తానని తెలియజేశారు. ఇటీవల విడుదలైన నాగబంధం చిత్రం లో కూడా గిరిజన మహిళగా చీరకట్టులోనే ప్రేక్షకులకు కనిపించినట్లు తెలియజేశారు దర్శకుడు సుకుమార్ పుష్ప 3 ఎప్పుడు నిర్మిస్తారో అని ఆశగా తాను కూడా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.
అనంతరం శుభప్రదం చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ నటి అనసూయ చేతుల మీదుగా తమ నాలుగో షోరూం ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ ₹99 నుండి ₹40,000 వరకు శారీస్, చుడీదార్స్, వెస్ట్రన్ వేర్, వన్ గ్రామ్ జ్యువెలరీ, బ్లౌజెస్ వంటి మహిళలకు సంబంధించిన అన్ని రకాల వెరైటీలు లభ్యమవుతాయని పేర్కొన్నారు. తాము వ్యాపారంలో తక్కువ లాభాలు (జెన్యూన్ ప్రాఫిట్స్) ఆశిస్తూ వ్యాపారం చేయడం వల్లే తక్కువ కాలంలోనే నాలుగో బ్రాంచ్ ప్రారంభించగలిగామని, తమ 32 ఏళ్ల అనుభవంతో వినియోగదారులకు సరికొత్త డిజైన్లు తక్కువ ధరలకే అందిస్తున్నామని వివరించారు. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఈ షోరూంను ఏర్పాటు చేశామని, సామాన్యులు కూడా రిచ్‌గా కనిపించాలనేదే తమ ముఖ్య ఉద్దేశమని సత్యనారాయణ స్పష్టం చేశారు. నగర ప్రజలందరూ ఈ షోరూంను సందర్శించి ఆదరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో షోరూం అధినేతలు సత్యనారాయణ, సునీత , జ్ఞానేశ్వర్, భవానీ, రోహన్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News