విదేశాల లో అర్హత కలిగిన యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా విదేశాల లో (ఫిన్లాండ్ మరియు జర్మనీ) నందు అర్హత కలిగిన యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడును.

1: ఫిన్లాండ్ దేశం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో (Auto Body Technicians, Structural Body Repair Specialists,MIG&TIG welders, Metal Workers) సంబంధిత ఉద్యోగ అవకాశాలు కల్పించబడును వారానికి 40 గంటలు పని దినములు.

వయస్సు: 25 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి.

విద్యార్హతలు : ITI, Diploma విద్యార్హత కలిగి ఉండాలి మరియు మూడు నుంచి ఐదు సంవత్సరములు అనుభవం కలిగి ఉండాలి బేసిక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి.

జీతం: ఉద్యోగానికి ఎంపికైనవారికి *నెలకు 3 లక్షల నుండి 5 లక్షల వరకు వేతనం పొందవచ్చు.

రిజిస్ట్రేషన్ చివరి తేదీ:12-07-2026.

2: జర్మనీ దేశం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో Bus Driver, Trainee Providing Locomotive Driver, Trainee Train Driver, Ticket Inspection Staff, Travel Advieor,Traffic Control Dispatcher (ఎలక్ట్రికల్) ఉద్యోగాలు కొరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు కొరకు క్రింద తెలుపబడిన రిజిస్ట్రేషన్ లింకులో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.

*వయస్సు: 25 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి.

విద్యార్హతలు : ITI, Diploma, Engineering Graduates(Mechanical, Electrical, Electronics, Civil, Automobile, Mechatronics) Experienced Drivers కలిగి ఉండాలి మరియు Freshers కూడా అప్లై చేసుకోవచ్చు

జీతము: ఉద్యోగానికి ఎంపికైనవారికి నెలకు *3 లక్షల నుండి 5 లక్షల వరకు వేతనం పొందవచ్చు.

రిజిస్ట్రేషన్ చివరి తేదీ:15-07-2026.

ఆసక్తి గల అభ్యర్థులు పాస్పోర్ట్, అనుభవం సంబంధిత విద్యా ధృవపత్రాలతో రిజిస్ట్రేషన్ కొరకు ఈ క్రింద వెబ్సైట్ లో నమోదు చేసుకోవలసినదిగా కోరుచున్నాము
https://naipunyam.ap.gov.in/user-registration?page=program-registration

మరిన్ని వివరములుకు ఫోన్ నంబర్లు :9160912690,9988853335 ను సంప్రదించండి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *